చంద్రబాబు: ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ దూరమేనా..?

Divya
ఇటీవల జరిగిన ఎన్నికలలో టిడిపి కూటమిలో భాగంగా భారీ విజయాన్ని అందుకుంది. జనసేన, బిజెపి పార్టీలతో కలిసి పోటీ చేసిన టిడిపి 164 సీట్లలో మంచి విజయాన్ని అందుకొని అధికారం చేపట్టింది. వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. రేపటి రోజున చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటి పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మోడీతో పాటు చాలా మంది సెలబ్రిటీలు నేతలు రాజకీయ నాయకులు పలువురు మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు.


ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యుల సైతం హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ప్రమాణస్వీకారనికి సంబంధించి ఆహ్వానం అందిందా లేదా అనే విషయం పైన సినీ రాజకీయాలలో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.. ఒకవేళ ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా లేదా అనే ప్రశ్న మొదలయ్యింది.. టిడిపి తరఫున ఎన్టీఆర్కు ఆహ్వానం అందిన ఆయన వచ్చే అవకాశాలు లేవని వార్తలు ఇప్పుడు రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.


అలాంటి సమయంలో ఎన్టీఆర్ స్పందించకుండా ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా అంటే అభిమానులు కూడా నమ్మడం లేదు..అయితే కూటమి విజయాన్ని అందుకున్న తర్వాత కూటమి నేతలకు అభినందనలు తెలుపుతూ ఎన్టీఆర్ ఒక ట్విట్ అయితే షేర్ చేశారు. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకున్నందుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు. ఈ పోస్ట్ కు చంద్రబాబు కూడా స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్టీఆర్ హాజరవుతారో లేదో చూడాలి మరి. నారా లోకేష్ ,పవన్ కళ్యాణ్ వంటి వారు ఈసారి ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: