చంద్రబాబు: అవమానించిన వారిని ఉతికారేసిన దమ్మున్న లీడర్ రా!

Purushottham Vinay

•పడి లేచిన కెరటం చంద్రబాబు

•అవమానాలని అధిగమించిన దమ్మున్న లీడర్ బాబు

•తన గెలుపుతో వైసీపీని చిత్తు చేసిన బాబు

చంద్రబాబు అపార అనుభవం ఉన్న గొప్ప రాజకీయ నాయకుడు. ఇప్పుడు హైదరాబాదుని చూసి చంకలు గుద్దు కుంటున్నారు తెలంగాణ నేతలు, ప్రజలు. కానీ ఆ హైదరాబాద్ ని అభివృద్ధి చేసి నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సిటీగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అయితే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఇన్నేళ్లలో బాగా మనోవేదనకి గురైన కాలం  2019 - 2024. ఎందుకంటే గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అన్న కనీస గౌరవం లేకుండా చంద్రబాబును తీవ్ర అవమానంపాలు చేశారు వైసీపీ నాయకులు. అసెంబ్లీ సాక్షిగా నిందారోపణలు చేస్తూ, ఆయన సతీమణిని అవమానించడంతో ఆయన అసెంబ్లీ నుంచి శోకాతప్తుడై బయటకి వచ్చారు. గుండెలు పగిలే ఆవేదనను అదుపు చేసుకోలేక అంత పెద్ద నేత అయ్యుండి కూడా కన్నీరు కార్చారు. బయటకు వచ్చే ముందు కౌరవ సభగా మారిన అసెంబ్లీని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని చంద్రబాబు శపథంచేశారు. ఆరోజున చంద్ర బాబు కంట కారిన కన్నీరు, ఆయన చేసిన శపథం ఆంధ్ర ప్రజల గుండెలను కదిలించి వేశాయి.

ప్రజలంతా కూడా ఆయన వెంటే నిలిచారు. ఆయన శపథం నెరవేరేలా చరిత్ర ఎరుగని గెలుపుతో ఆంధ్రులు తీర్పునిచ్చారు.అసలు అధికార వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేసి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలాంటి విజయం ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమని, పడిన చోటే లేచి తలెత్తుకు నిలిచే తత్వం వల్లే ఆయన ఇప్పుడు ఇంతటి ఘన విజయాన్ని సాధించారని ప్రజలు చెబుతున్నారు. అవమానాల్ని అధిగ మించి ఆత్మస్థైర్యంతో తాను నిలబడడమే కాకుండా, తాను తలపెట్టిన రాజధానిని ఇంకా తనను నమ్మిన రైతాంగాన్ని కాపాడారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గెలుపు కేవలం చంద్రబాబు గెలుపు మాత్రమే కాదని అది రాజధాని రైతుల, రాష్ట్ర ప్రజల గెలుపని అంటున్నారు. రాజధాని రైతులను బాగా వేధించడం, మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా చంద్రబాబును దారుణంగా అవమానించడం జగన్‌ మోహన్ రెడ్డి చేసిన పాపం. అదే అతనికి శాపంలా మారింది. ఇంకో 10 ఏళ్ల వరకు జగన్ కోలుకోలేడు. 10 ఏళ్ల తరువాత కూడా కోలుకుంటాడని నమ్మకం లేదు. చంద్రబాబును అవమానించడమే కాకుండా ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిని అల్లరిపాలు చేయాలనుకోవడమే వైసీపీకి శాపంగా మారింది. అందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: