పవన్ కళ్యాణ్‌ కు కొత్త బాధ్యతలు..ఇక వైసీపీ ఖాళీ కావడం గ్యారెంటీ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఈ నెల 12వ తేదీన కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు అవుతుంది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఇంకోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన కూటమి సభ్యులు కొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.ఆయనకు 15 మందికి పైగా ఆ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  దీంతో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు.

అయితే ఇది మొదటినుంచి అందరూ అనుకుంటున్నా వార్త. కానీ తాజాగా చంద్రబాబు ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారట. పవన్ కళ్యాణ్ కు కొత్త బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారట. డిప్యూటీ సీఎం హోదాలో  పవన్ కళ్యాణ్ ఉంచి... హోం మంత్రి అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖలు  ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారట. కేంద్రంలో జనసేన పార్టీకి ఒక్క పదవి కూడా రాలేదు. పదవులన్నీ తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ తీసుకుంది.

దీంతో ఏపీ ప్రభుత్వంలో జనసేనకు ఎక్కువగా  పదవులు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ కు ఈ మూడు శాఖలు అప్పగించనున్నారట. అంతేకాకుండా... మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వనున్నారట చంద్రబాబు. ఇక హోం మంత్రి శాఖ పవన్ కళ్యాణ్ కి ఇస్తే... వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్రమార్కులైన వైసీపీ నేతలను... పవన్ కళ్యాణ్ చెడుగుడు ఆడుకుంటాడని చెబుతున్నారు. ఈ దెబ్బకు వైసిపి పార్టీ ఖాళీ కావడం ఖాయం ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: