జగన్‌కి వెన్నుపోటు పొడవడానికి కీలక ఎంపీలు రెడీ..??

Suma Kallamadi
ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు సంబంధించి అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన రాజకీయ పుకార్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత రూమర్స్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ పార్టీకి చెందిన 15 మంది ఎంపీలలో 10 మంది (లోక్‌సభ, రాజ్యసభ రెండూ) త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరవచ్చు.మాజీ సీఎం జగన్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎన్డీయే కూటమి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇదిలావుండగా, 175 మంది ఎమ్మెల్యేలలో 11 మంది మాత్రమే గెలిచారు, వైసీపీ 25లో 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఓడిపోయిన పార్టీల రాజకీయ నాయకులు తమ రాజకీయ జీవితం కోసం, వారి వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి అధికార పార్టీలోకి జంప్ చేస్తుంటారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో టీడీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ ఎంపీల్లో నలుగురు బీజేపీలో చేరారు.
ఈసారి వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. బీజేపీ టీడీపీతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంది, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వైస్సార్సీపీతో సంబంధం లేకుండా చేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారట. మిథున్ రెడ్డి తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవాలనుకుంటుండగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును ఫేస్ చేస్తున్న అవినాష్ రెడ్డి తన పేరును క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారట.
రాజ్యసభలో, వైస్సార్సీపీలో 2026 నుంచి 2030 వరకు పదవి కాలం ఉన్న 11 మంది ఎంపీలు ఉన్నారు. ప్రముఖ ఎంపీలలో విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరామ ఉన్నారు. ముఖ్యమైన బిల్లులను ఆమోదించాలంటే బీజేపీకి రాజ్యసభ ఎంపీల మద్దతు అవసరం కాబట్టి కొందరు వైఎస్సార్సీపీ నేతలను తమతో కలుపుకోవాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అందువల్ల, వీరిలో సగానికి పైగా ఎంపీలు త్వరలో బీజేపీకి మారే అవకాశాలు బలంగా ఉన్నాయి.
తదుపరి లోక్‌సభ స్పీకర్‌ ఎవరన్నదే ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. టీడీపీ, జేడీయూ కూటమి భాగస్వామ్య పక్షాలు. కాబట్టి, ఎన్డీయేకు మద్దతిచ్చే వీటిలో ఏదో ఒక పార్టీ స్పీకర్ పదవిని డిమాండ్ చేయవచ్చు. స్పీకర్ పదవి టీడీపీకి దక్కితే, బీజేపీలో చేరేందుకు వైసీపీ నేతలు రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ కూటమి భాగస్వామిగా ఉన్నప్పుడు వైసీపీ ఎంపీలను బీజేపీ అంగీకరిస్తుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: