ఏపీ: వైసిపి నవరత్నాలకు గుడి ధ్వంసం.. హస్తిలో ఆందోళన..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు ఈసారి చాలా హోరా హోరీగా జరిగాయి. ముఖ్యంగా టిడిపి పార్టీ కూటమిలో భాగంగా 164 సీట్లతో భారీ ఘన విజయాన్ని అందుకుంది.. వైసిపి పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు..  అంతేకాకుండా పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు ఇంటి పైన కూడా దాడులు చేస్తూ ఉండడమే కాకుండా కొన్ని ప్రాంతాలలో క్రూరంగా మనుషులను చంపుతూ ఉన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం చేసిన అరాచకాలను తలుచుకొని బాధపడ్డామని అందుకే ఈసారి తమ వంతుగా తెలుగు తమ్ముళ్లు నానా హంగామా సృష్టిస్తున్నారని తెలియజేస్తున్నారు.

వైసిపి ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేపట్టిన శిలాఫలకాలను సైతం ధ్వంసం చేస్తూ పేర్లను తొలగించే పనులు కూడా ఇప్పటికే టిడిపి నేతలు,  కార్యకర్తలు సైతం చాలా ప్రాంతాలలో చేపట్టారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ శ్రీకాళహస్తిలో నిర్మించిన వైసీపీ నవరత్నాల గుడిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఆలయాన్ని నేలమట్టం చేసి అక్కడి నుంచి పరారైనట్టుగా సమాచారం.

దీంతో వెంటనే స్థానిక వైసీపీ నేతలు ఈ ఘటన పైన పోలీసులకు సైతం ఫిర్యాదు చేయగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ తెలియజేశారు. అయితే గుడి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే గత ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పేరు మార్చిన విషయం తెలుసండి ఇంకా చంద్రబాబు నాయుడు టిడిపి తరఫున సీఎం పదవి కోసం ప్రమాణస్వీకారం చేయలేదు అప్పుడే కొంతమంది టిడిపి కార్యకర్తలు వైఎస్ఆర్ అనే పదాన్ని కాళ్లతో తన్ని మరి లెటర్స్ ని తొలగించడం జరిగింది. అంతే కాదు పలు చోట్ల వైయస్సార్ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తూ నానా హంగామా చేస్తున్నారు . మరి ఈ ఆగడాలను చంద్రబాబు నాయుడు ఎందుకు అరికట్టకుండా చూస్తూ ఉండిపోతున్నారు అనేది ఇప్పుడు అందరిలో పెద్ద ప్రశ్నగా మారింది దీనికి పదవి స్వీకారం తర్వాత చంద్రబాబు ఏదైనా స్పందిస్తారేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: