లోక్‌ సభ స్పీకర్‌ గా దగ్గుబాటి పురంధేశ్వరి ?

Veldandi Saikiran

కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం రాబోతుంది. 294  స్థానాలను కైవసం చేసుకున్న ఎన్డీఏ... కేంద్రంలో మరోసారి అంటే ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు  మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు...  మరో 30 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా కూడా... ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

అయితే.. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా ఐదుగురికి స్థానం  కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. కాసేపటి క్రితమే ప్రధాని నివాసంలో... ఎన్డీఏ కూటమి  సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి స్థానం కల్పించినట్లు... నువ్వు వార్త బయటకు వచ్చింది.

ఇందులో తెలంగాణ రాష్ట్రంలో నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి అలాగే కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కి ఛాన్స్ దక్కిందట. ఇక ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు ఛాన్స్ దక్కిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... చిన్నమ్మ, ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి కీలక పదవి కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.

రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన పురంధరేశ్వరి... లోక్సభ స్పీకర్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి దగ్గుబాటి పురందరేశ్వరి కూడా ఓకే చెప్పారట. ఇక సాయంత్రంలోగా దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం అందుతుంది. మహిళను స్పీకర్ చేస్తే... ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి మార్కులు పడతాయని... మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ గా దగ్గుబాటి పురంధేశ్వరి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలోనే.. బీజేపీ ఏపీలో బాగా పుంజుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: