ఏపీ: వైసిపి ఓటమిపై.. రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఏమన్నారంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసిపి ఘోరమైన ఓటమిని చవిచూసింది.. ముఖ్యంగా టిడిపి కూటమిలో భాగంగా భారీ విజయాన్ని చేకూర్చడంతో టిడిపి నేతలు కార్యకర్తలు జనసేన బిజెపి నేతలు కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ వైసీపీ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఏంటి కారణం అనే విషయం పైన అటు నేతలు అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆలోచనలు పడిపోయారు.. ఇలాంటి సమయంలోనే తాజాగా వైసిపి ఓటమిపైన రాజ్య సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ పలు విషయాలను తెలియజేశారు.

దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను జగన్ గారు అందించారు. ఎక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ తమకు అర్థం కావడంలేదని ఆయన వెల్లడించారు.. ప్రజలందరూ వైసీపీకే ఓటు వేస్తున్నామని చెప్పారు ఓటమి పైన లోతైన విశ్లేషణ కూడా జరుగుతుందన్నారు జగన్ ప్రజలు వద్దు అనుకోలేదు. ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగింది ఈవీఎంలో ఏవైనా లోపం ఉందా అని అనుమానాలు కూడా ఉందని వెల్లడించారు. జగన్ గారు అహంకారంతో ఓడిపోలేదని ఏపీ అభివృద్ధి పైన కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశం పైన తాను ఇప్పుడు స్పందించనని కూడా తెలియజేశారు ఆర్ కృష్ణయ్య.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి 135 జనసేన 21 బిజెపి 8 వైసీపీ 11 స్థానాలు గెలుపొందారు ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజారిటీ టిడిపి పార్టీ సాధించింది ఈ సమయంలోనే ఈనెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని వాటిని అమలు చేస్తారు చూడాలి మరి. వైసిపి నేతలపైన జరుగుతున్న దాడులను కూడా ఖండిస్తూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు నేతలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గవర్నర్కు కూడా ఒక లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇలాంటి విధ్వంసకరమైన సంఘటనల పైన చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: