టీడీపీ చేస్తున్న దాడులు జనసేనానికి కనిపించడంలేదా: వైసీపీ

Suma Kallamadi
ఆంధ్రాలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎటువంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అవును, అదొక చరిత్రాత్మకం. ప్రజలు వారికి మరపురాని విధంగా పట్టం కట్టారు. అదేవిధంగా 2019లో కూడా జరిగింది. అయితే ఆ తరువాత ఆంధ్రాలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. వైసీపీ అప్పట్లో అధికారంలోకి వచ్చి రావడంతోనే కట్టడాలను కూల్చడం మొదలు పెట్టింది. అది ఎంతవరకు వెళ్లిందో ప్రజలు కళ్లారా చూసారు. అదే సీన్ ఇపుడు రిపీట్ అవుతోంది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ శ్రేణులు వైసీపీని టార్గెట్ గా చేసుకొని అల్లర్లు సృష్టించడం మొదలు పెట్టాయి. అవును, విపక్షాలు ఆంధ్రాలో సుసంపన్న రాజకీయాలు చేయడం మాని ప్రతీకార రాజకీయాలు చేయడం మొదలు పెట్టడం చాలా బాధాకరం.
జగన్ కట్టించిన సచివాలయాలు, వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడం వంటివి చర్యలు టీడీపీ చేస్తోందని ఇపుడు వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పచ్చ రంగులు తెచ్చి బులుగు కలర్ ని చెరిపేస్తున్నారని వారు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి రావడంతోనే వెంటనే ఈ ప్రతీకార దాడులకు తెగబడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో రాజకీయం అలా చీలిపోయి ఉంది. గెలిచిన వారు గర్వంతో ఉగిపోతుంటే ఓడిపోయినవారు ఏమీ చేయలేని చేవలేనివారిలాగా చూస్తూ ఉండిపోవలసి వస్తుంది. తాజాగా ఒంగోలులో జరుగుతున్న దాడుల మీద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రావు రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ కే నేరుగా అప్పీల్ చేయడం జరిగింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీక రాజకీయాలు వద్దు! అని సందేశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు కనబడడం లేదేమిటి అని ప్రశ్నిస్తున్నారు. అదేసమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను హర్షణీయం అంటూ కొనియాడారు. ఇపుడున్న పరిస్థితుల్లో పవన్ తప్పితే తమని ఎవరూ కాపాడలేరని వారు అభిప్రాయ పడుతున్నారు. అయితే జనసేనాని పవన్ ప్రస్తుతం nda కూటమిలో ముఖ్యమైన భాగస్వాముడు కాబట్టి ఢిల్లీ రాజకీయాల్లో తనమునకలై ఉన్నాడు. మరి కొన్ని రోజులు తరువాతైనా పవన్ ఇటువంటి చర్యలను ఖండిస్తాడో లేదో చూడాలి మరి అంటూ వైసీపీ శ్రేణులు ఇపుడు కాచుకు కూర్చుంటున్న పరిస్థితి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: