తారక్ ట్వీట్‌కి ఊహించని విధంగా రిప్లై ఇచ్చిన చంద్రబాబు..??

Suma Kallamadi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లు గెలుచుకొని అతి పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీ సింగిల్ 134 సీట్లు గెలుచుకోగలిగింది. అంటే పొత్తు లేకపోయినా ఈ ఒక్క పార్టీ ఈజీగా అధికారంలోకి వచ్చి ఉండేది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 26 సీట్లకే పరిమితమయ్యారు కానీ ఈసారి ప్రజలు మళ్ళీ ఆయనకే బ్రహ్మరథం పట్టారు. పొత్తుల కుదుర్చుకోవడం ఎన్నికల ప్రచారం చేయడం సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఇవ్వడం, ఇలా ప్రతి దాంట్లో చంద్రబాబు తన అనుభవాన్ని ప్రదర్శించి వైసిపి పార్టీని చిత్తుగా ఓడించగలిగారు.
 ఈసారి పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా గెలిచి వావ్ అనిపించారు. వారందరికీ సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సైతం చంద్రబాబు విషెస్ తెలియజేశాడు ప్రియమైన చంద్రబాబు మామయ్యకి అభినందనలు అని అతను చెప్పాడు. అయితే ఆ ట్వీట్ కి తాజాగా చంద్రబాబు రిప్లై ఇచ్చారు. "థాంక్యూ వెరీ మచ్ అమ్మ" అంటూ చాలా ఆప్యాయంగా చంద్రబాబు తారక్ కు ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://x.com/ncbn/status/1798433850324033880?t=OTlenLO7au91nxp21cq4aw&s=19
తారక్‌ రీసెంట్‌గా 'ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు. ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుత మెజార్టీతో గెలిచిన లోకేశ్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్, ఎంపీలుగా గెలిచిన భరత్ కు, పురందీశ్వరి అత్తకు, ఘన విజయం సాధించిన పవన్‌ కళ్యాణ్ కు నా శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు. దీనికి చంద్రబాబు ఊహించని రీతిలో స్పందించడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక చంద్రబాబుకు మహేష్ బాబు, మోహన్ బాబు, తదితర ప్రముఖులు కూడా విషెస్ తెలిపారు వారందరికీ కూడా థాంక్యూ వెరీ మచ్ మోహన్ బాబు, మహేష్ బాబు గారు అంటూ రిప్లై ఇచ్చారు. ఇకపోతే త్వరలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఆయన చాలా మంచి చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: