పడి లేచిన కెరటం బాబు..అంత ఈజీ అనుకున్నావా జగన్..!

Pandrala Sravanthi
- పోగొట్టుకున్న చోటే వెతుక్కున్న చంద్రబాబు..
- తాను విద్య నేర్పిన నాయకులు తన ని విమర్శిస్తుంటే నలిగిపోయాడు..
- సైలెంట్ గా ఉండి సింహం లాగా దెబ్బ కొట్టాడు..

చంద్రబాబు రాజకీయ అనుభవం ఉన్నంత ఏజ్ ఉండదు జగన్ కు . అయినా ఆయన్ని ఢీ కొట్టారు. ఒక్కసారి చంద్రబాబు పై గెలవగానే  ప్రపంచాన్ని గెలిచాడు అనుకున్నాడో ఏమో, అదే ఊహల్లో బతికేశాడు. కింది స్థాయిలో ఏం జరుగుతుందనేది ఆలోచించలేదు. చివరికి చతికిలపడి ఓడిపోయాడు. చంద్రబాబు ఇలాంటి ఓటములు ఎన్నో చూశాడు. ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. జగన్ నాన్న వైయస్సార్ తోనే పోరాడిన ధీరుడు చంద్రబాబు. అలాంటిది జగన్ ఎంత.. ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేసే తెలివి ఉన్నా కానీ  ఏనాడు విర్రవీగలేదు. తన పని ఏంటో తాను చేసుకుంటూ వెళ్ళాడు  చివరికి జగన్ కు కర్ర కాల్చి వాత పెట్టినంత పని చేశాడు. టిడిపి చరిత్రలోనే ఏనాడు లేనివిధంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు చంద్రబాబు నాయుడు. 


అలాంటి చంద్రబాబు ఇంతటి స్థాయికి రావడానికి పడ్డ కష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1995లో తొలిసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో ఎన్డీఏ కూటమితో జతకట్టిన బాబు  192 సీట్లను కొల్లగొట్టి రెండవసారి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు. ఆ ఎన్నికల్లో టిడిపి సొంతంగా 180 స్థానాలు గెలుచుకుంది. మిత్ర పక్షం బిజెపి 12 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ 91 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత  చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారు. అప్పుడు ఎన్డీఏతో జతకట్టిన టిడిపి 126 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో టిడిపి ఓడిపోయింది. మళ్లీ ఈ ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టి  మొత్తం 164 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ ఐదేళ్లతో కలుపుకుంటే 19 ఏళ్ల పాటు  పాలించిన సీఎంగా రికార్డులకు ఎక్కుతారు చంద్రబాబు.  


అలాంటి 40 సంవత్సరాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబును  జగన్ తక్కువగా అంచనా వేసి చాలా చులకన చేసి మాట్లాడాడు. చివరికి ఆయనను కొన్ని నెలల పాటు జైల్లో కూడా ఉంచాడు.  ఈ విధంగా చంద్రబాబును జగన్ కింద ఉన్న నాయకులంతా ఎంతో చులకన చేసి మాట్లాడారు. కనీసం ఆయన అనుభవానికి వయసుకు కూడా విలువ ఇవ్వలేదు. అయినా చంద్రబాబు  కనీసం వారిని విమర్శించకుండా తన పని ఏంటో తాను  సైలెంట్ గా చేశాడని చెప్పవచ్చు. సింహం పంజా విసిరే ముందు చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆ విధంగానే చంద్రబాబు కూడా సైలెంట్ గా ఉండి ఏనుగు కుంభస్థలాన్ని దెబ్బ కొట్టాడు. ఆయన సైలెంటును చేతకానితనం అనుకున్నాడో ఏమో, అహంకారపూరితమైన మాటలు మాట్లాడి జగన్ తన ఓటమికి తానే కారకుడు అయ్యాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: