పవన్‌ : ఎక్కడ నెగ్గాలో కాదు...ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు !

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు... సంచలనానికి తెరలేపాయి. గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను తెలుగుదేశం కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. అయితే ఇందులో... జనసేన పార్టీ 21 స్థానాలకు 21 స్థానాలు గెలుచుకొని... చరిత్ర సృష్టించింది. అటు పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకోగలిగింది జనసేన.

 
 తెలుగుదేశం కూటమి ఇంతలా సక్సెస్ కావడానికి... ముఖ్య కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో అలాంటోడే గొప్ప... తన సినిమా డైలాగును...  ఏపీ రాజకీయాలలో రుజువు చేయగలిగాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.... 175 స్థానాలకు పోటీ చేసే...సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్...  కేవలం 21 స్థానాలు తీసుకొని... అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ సొంతంగా వెళ్తే... భారీ స్థానాలని దక్కించుకునేవాడు.

 
 కానీ స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ ఆలా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనమే తనకు ముఖ్యమని.. ఇరవై ఒక్క స్థానాలు తీసుకొని సర్దుకున్నాడు. జనసేన కార్యకర్తలు, నేతలు ఎంత అన్న కూడా... వాళ్లను కాంప్రమైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాడు. జనసేన పార్టీని వీడే వారిని... పట్టించుకోకుండా.. ఏపీ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశాడు. చాలామంది కాపు నేతలు ముఖ్యమంత్రి పదవి అడుగు అంటూ... పవన్ కళ్యాణ్ పై చాలా ఒత్తిడి తెచ్చారు.


 ఆ పదవిని చంద్రబాబు నాయుడు మాత్రమే తీసుకోవాలని... తనకు ఏపీ ప్రయోజనమే  ముఖ్యమని చాలా తగ్గిపోయాడు. అచ్చం సినిమా స్టైల్ లో... ఏపీ రాజకీయాలను శాసించాడు పవన్ కళ్యాణ్. బిజెపికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని... కలపడంలో ముఖ్యపాత్ర పోషించాడు. జనసేన, తెలుగుదేశం, బిజెపి  ఈ మూడు పార్టీలను కలపడంలో కీలక పాత్ర పోషించి... ఒక పెద్ద నాలాగా తయారయ్యాడు పవన్. ఎంతమంది విమర్శలు చేసినా... రాజమండ్రి జైలుకి వెళ్లి చంద్రబాబు నాయుడుతో  కలిసి ఏపీ భవిష్యత్తును నిర్ణయించాడు. రాజమండ్రి జైలు నుంచి... ఏపీ పునర్ నిర్మాణానికి  కొత్త నాంది పలికాడు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: