ఎమ్మిగనూరులో పేదరాలిని గెలిపించుకోలేకపోయిన జగన్.. బుట్టా బుట్ట సర్దేశారా?
ఇదే సమయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి తరపున జయనాగేశ్వరరెడ్డి పోటీ చేయడం జరిగింది. బుట్టా రేణుక, జయనాగేశ్వర రెడ్డిలలో ఇద్దరికీ స్థానికంగా మంచి పేరు ఉండటంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో గెలుపును అటు వైసీపీ ఇటు కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ మొత్తంలో ఖర్చు చేశాయని కూడా వార్తలు వినిపించాయి.
అయితే ఈ నియోజకవర్గంలో ఎవరూ ఊహించని ఊహించని కూటమి అభ్యర్థికే ఎమ్మిగనూరు ఓటర్లు పట్టం కట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బుట్టా రేణుకకు సాధిస్తూ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఘన విజయం సాధించారు. బుట్టా రేణుకపై ఏకంగా 14,816 ఓట్ల మెజారిటీతో బీవీ జయనాగేశ్వర రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగగా బుట్టా బుట్ట సర్దేయాల్సిన టైమ్ వచ్చిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఓటర్లు వైసీపీ సంక్షేమానికి కాకుండా కూటమికే తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చిత్తుచిత్తుగా ఓడింది. కేకే సర్వే అంచనాలే నిజమై రాష్ట్రంలో ఎవరి ఊహలకు అందని ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉండగా ఆ కారణాలు వైరల్ అవుతున్నాయి. అతి సంక్షేమమే వైసీపీని ముంచేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి గురించి బుట్టా రేణుక రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.