విజయనగరం ఎంపీ సీటును ఎగరేసుకెళ్ళిన కూటమి..!

Pulgam Srinivas
ఈ రోజు ఉదయం 6 గంటల నుండి మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన ఎన్నికల సిబ్బంది ఆ తర్వాత ఈవీఎం కోట్ల లెక్కింపును ప్రారంభించింది. ఇకపోతే ఇప్పటికే ఎన్నికల సంఘం ఇటు అసెంబ్లీ , అటు పార్లమెంట్ రెండింటికి సంబంధించిన ఓట్ల లెక్కింపును పూర్తి చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు , అలాగే కొన్ని పార్లమెంటుకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇకపోతే తాజాగా విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించిన ఎన్నికల ఫలితాన్ని ఎలక్షన్ సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా బెల్లాన చంద్ర శేఖర్ బరిలో నిలవగా , పొత్తులో భాగంగా ఈ ప్రాంత పార్లమెంటు స్థానాన్ని తెలుగు దేశం పార్టీ దక్కించుకుంది.

ఇక ఈ పార్టీ నుండి కలిశెట్టి అప్పలనాయుడు బరిలో నిలిచారు. ఇకపోతే 2014 వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అశోక్ గజపతిరాజు ఈ ప్రాంతం నుండి ఎంపీగా గెలుపొందారు. ఇక 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి బెల్లాన చంద్ర శేఖర్ ఈ ప్రాంతం నుండి ఎంపీ అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం సెట్టింగ్ ఎంపీ గా ఉన్న చంద్రశేఖర్ కే జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఈ ప్రాంతం నుండి ఎంపీ టికెట్ ను ఇచ్చారు.

ఇక చంద్ర శేఖర్ ప్రస్తుతం ఈ ప్రాంతం సెట్టింగ్ ఎంపీ కావడం , అలాగే అధికార పార్టీ నేత కావడంతో ఈయనకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. తెలుగు దేశం ఈ సారి జనసేన , బిజెపి తో పొత్తులో భాగంగా పోటీ చేయడంతో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు కు టిడిపి అనుకూల ఓట్లతో పాటు జనసేన , బీజేపీ అనుకూల ఓట్లు కూడా పడే అవకాశం ఉంది.

దానితో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని జనాలు మొదటి నుండి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ పెద్దగా మొదటి నుండి భారీ పోటీ ఏమి లేదు. కూటమి అభ్యర్థి అయినటువంటి కెలిశెట్టి అప్పలనాయుడు మొదటి నుండి భారీగా ఓట్లను దక్కించుకుంటూ వైసిపి అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ పై విజయాన్ని సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: