విశాఖ - భీమిలి: శ్రీను Vs శ్రీను! శిష్యుడుని చిత్తుగా ఓడించి టీడీపీని గెలిపించిన గురువు!

Purushottham Vinay
ఎన్నికల ముందు తెలుగుదేశం, బిజెపి ఇంకా జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరడంతో మొదట భీమిలి సీటుపై సందిగ్దత నెలకొంది. ఇక్కడి నుండి పోటీ చెయ్యడానికి టిడిపి, జనసేన పార్టీలు ఎంతో ఆసక్తిని చూపించాయి.కానీ ఆఖరికి ఈ సీటుని మాజీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు పట్టుబట్టడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒప్పుకోక తప్పలేక ఆయనకి సీటు ఇచ్చారు. గంటాను చీపురుపల్లి పంపించి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలన్న చంద్రబాబు ప్రయత్నాలు మొత్తానికి ఫలించ లేదు. ఎట్టకేలకు భీమిలి నుండి మరోసారి గంటా పోటీకి సిద్దమవ్వడం జరిగింది.మరోవైపు భీమిలిలో మరోసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ చేశారు. గతంలో ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల్లో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు కూడా గురు శిష్యులు. ఇప్పుడు భీమిలిలో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఇద్దరూ కూడా గట్టి పోటీదారులు కావడంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి జనాల్లో బలంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు రాజకీయాల్లో బాగా రాడ్డు తేలినవారు.


భీమిలి నియోజకవర్గ పరిధిలో విశాఖపట్నం రూరల్,  ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాలు ఉన్నాయి. భీమిలి అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య - 3,07,144 గా ఉంది. అందులో పురుషులు - 1,53,298 మంది ఉండగా మహిళలు - 1,53,827 మంది ఉన్నారు.మరోసారి భీమిలి అసెంబ్లీ బరిలో వైసీపీ తరపున దిగిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎలాగైనా గెలవాలని కష్టపడ్డారు. ఈయన 2009 లో ప్రజారాజ్యం, 2019 లో వైసిపి నుండి ఇదే భీమిలిలో పోటీచేసి గెలిచారు. ముచ్చటగా మూడోసారి భీమిలి నుండే పోటీ చేశారు అవంతి శ్రీనివాస్. ఇక భీమిలి నియోజకవర్గం వర్గమే కావాలని పట్టుబట్టి ఆ నియోజకవర్గంలో సీటు కోసం టిడిపి, జనసేన పార్టీలు పోటీపడ్డాయి. చివరకు ఇక్కడ పోటీకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టు వదలకుండా ఆసక్తి చూపించడంతో జనసేన వెనక్కి తగ్గింది. ఫలితంగా గంట శ్రీనివాసరావు తన శిష్యుడు అవంతి శ్రీనివాస్ ని చిత్తుగా ఓడించారు.గంటా శ్రీనివాసరావుకి 176230 (+ 92401) ఓట్లు పోలయ్యి ఆధిక్యంలో ఉన్నారు. అవంతి శ్రీనివాస్ కేవలం 83829 ( -92401) ఓట్లతో తన గురువు చేతిలో చిత్తుగా ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: