మైలవరం : చెప్పి మరీ జగన్ తుప్పు రేపిన వసంత కృష్ణప్రసాద్..!
అందుకే జగన్ పని కట్టుకుని మైలవరం జడ్పీటీసీ గా ఉన్న సర్నాల తిరుపతిరావు యాదవ్‌కు సీటు ఇచ్చారు. తిరుపతి రావు అతి సామాన్య కార్యకర్త.. ఆయన్ను కృష్ణ ప్రసాదే జడ్పీటీసీగా గెలిపించారు. అయితే జగన్ అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడంతో పాటు ఆర్థిక, అండ బలాలు పుష్కలంగా అందించారు. తనను కాదని బయటకు వెళ్లిన కృష్ణ ప్రసాద్‌పై ఓ సామాన్యుడిని నిలబెట్టి ఎమ్మెల్యేను చేశానన్న ఘనత తనకు దక్కాలన్నదే జగన్ పంతంగా కనిపించింది. తిరుపతిరావు బీసీల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీ ఓటర్లతో పాటగు వైసీపీ సంప్రదాయ ఓటర్లను ఏకం చేసి ఇక్కడ కృష్ణ ప్రసాద్‌ను దెబ్బ కొట్టాలన్నదే జగన్ ప్లాన్‌గా కనిపించింది.
అయితే అటు కృష్ణ ప్రసాద్ పార్టీ మారినా వ్యక్తిగతంగా ఆయన మంచి వాడే అన్న పేరుంది. పైగా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గం కూడా బాగా కలిసి వచ్చింది. టీడీపీ ధనికుడు... వర్సెస్ వైసీపీ సామాన్యుడు మధ్య హెరాహోరీ పోరు ఉంటుందనుకున్న మైలవరంలో ఫైనల్ గా జగన్‌ను కాదని మరి పార్టీ వీడి టీడీపీలో చేరిన వసంత జగన్ తుప్పు రేపి పడేశాడు. ఏకంగా 42829 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అసలు ఇది మామూలు విజయం కాదని చెప్పాలి.