రేవంత్ ను దెబ్బ కొట్టిన బీజేపీ.. కానీ చిన్న దెబ్బే?

praveen
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సీఎం సొంత ఇలాకాలో  ఉన్న పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే సీఎంగా ఉన్న వ్యక్తి తన సత్తా చాటి ఇక తమ అభ్యర్థులను గెలిపించుకుంటారని ఎవరు అనుకుంటూ ఉంటారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అలా జరగలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి సొంత జిల్లాగా ఉన్న మహబూబ్నగర్లో చివరికి సీఎం కే భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఘనవిజయాన్ని అందుకుంది.

 తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బిజెపి మొదటినుంచి ఎన్నో స్థానాలను ఆదిక్యంలో లో కొనసాగుతూ వస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సైతం మెజారిటీ సాధించడం విషయంలో గట్టి పోటీ ఇస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అదర కొట్టేశారు. అయితే సీఎం సొంత జిల్లాలో అయినా మహబూబ్నగర్లో పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే విషయంపై అందరూ ఉత్కంఠ గా ఎదురు చూసారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బిజెపి మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరిగింది.

 రౌండ్ రౌండ్ కి ఆదిక్యం మారుతూ వచ్చింది. ఇలా తీవ్ర ఉత్కంఠ మధ్య బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి డీకే అరుణ 3000 ఓట్ల స్వల్ప తేడాతో మహబూబ్నగర్లో విజయం సాధించారు. అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థిగా  డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌ రెడ్డి,  బిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు నిలిచారు. అయితే డీకే అరుణ, వంశీచంద్రెడ్డిలు లోకల్ నాయకులు కాదు.. అంటూ లోకల్ నాన్లోకల్ నినాదంతో మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. బిఆర్ఎస్ సీటింగ్ సీట్ బిజెపి వశం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: