విప్ల‌వ‌మా... తిరుగుబాటా.. ఏపీ ఫ‌లితం వెన‌క ఇంత పెద్ద సంచ‌ల‌నం ఉందా..!

RAMAKRISHNA S.S.
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
విప్ల‌వ‌మా.. తిరుగుబాటా.. ఏపీ ఫ‌లితం వెనుక ఏం జ‌రిగింది?
శ‌ప‌థం నెర‌వేరింది... చంద్ర‌బాబు జ‌గ‌న్‌ను గ‌ద్దె దించారు. అయితే క‌నివినీ ఎరుగ‌ని రీతిలో కూట‌మికి అప్ర‌తిహ‌త విజ‌యం క‌ట్ట‌బెట్టారు. అంతా మాకే అనుకున్న వైసీపీకి త‌ల‌కొట్టేసిన‌ట్టుగా మారిపోయింది.. ఈ ప‌లితం. మ‌రి ఇవి విప్ల‌వ‌మా.. తిరుగుబాటా. ? అన్న‌ది వైసీపీ వాళ్లే ఆలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఏదేమైనా చంద్ర‌బాబు చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ విజ‌యంగా ఇది నిలిచింది.

చంద్ర‌బాబు అరెస్ట‌యిన‌ప్పుడే.. జ‌నం డిసైడ్ అయిపోయారా.
నేటి ఫ‌లితానికి నాటి అరెస్టుకు లింకు.. అని చెప్పాలి.. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌దేళ్ల‌కు పైగా ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును ఎప్పుడు అయితే అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారో అప్పుడే ఆంధ్రా జ‌నం జ‌గ‌న్ పాల‌న‌ను స‌హించ‌లేక‌పోయిందా ? అన్న‌ది ఈ రోజు ఫ‌లితాలే చెప్పేశాయి.

శ‌ప‌థం నెర‌వేరిన వేళ‌.. చంద్ర‌బాబు జీవితంలో అనూహ్య మ‌లుపు
నాడు అసెంబ్లీలో శ‌ప‌థం చేసి.. మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్నారు. గౌర‌వ స‌భ‌లోకి గ‌ర్వ‌గా అడుగు పెడుతున్నారు. త‌న భార్య నారా భువ‌నేశ్వ‌రిని అవ‌మానించిన‌ప్పుడు ఆయ‌న కుంగిపోయారు.. అవ‌మానంతో త‌ట్టుకోలేక‌పోయారు. ఆ త‌ర్వాత జైలులు పెట్టారు. అప్పుడే చంద్ర‌బాబు తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని శ‌ప‌థం చేసి మ‌రీ స‌క్సెస్ అయ్యారు.

వైసీపీ స‌మాధి రాళ్లు..!
కూట‌మి క‌ట్టిన నుంచి.. గెలిచే వ‌ర‌కు.. ప‌వ‌న్ వేసిన ప్ర‌తి అడుగూ.. ప్ర‌త్యేకం.. బీజేపీతో క‌లిసి పోటీ చేయ‌డం నుంచి వైసీపీ అనేక రూపాల్లో అవ‌హేళ‌న చేసింది. అయినా.. ఆయ‌న ముందుకు సాగారు. ఎన్ని అవ‌మానాలు ఎదురైనా ప‌వ‌న్ ఈ గేమ్‌లో రియ‌ల్ హీరోగా  నిలిచి మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అయ్యారు.

మ‌లుపు-గెలుపు.. చంద్ర‌బాబు వ్యూహం!
పార్టీ క్లిష్ట ప‌రిస్థితి నుంచి గ‌ర్వంగా త‌లెత్తుకునే వ‌ర‌కు కూడా.. టీడీపీ సాధించిన విష‌యం అన‌న్య సామాన్యం. ఈ విజ‌యం ప్ర‌తి మ‌లుపులోనూ.. ఈ గెలుపులోనూ.. చంద్ర‌బాబు వ్యూహాలు అనేకం. పార్టీలో నేత‌ల‌ను బుజ్జ‌గించ‌డం.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెంచ‌డం.. వంటివి క‌లిసివ‌చ్చాయి. బీజేపీ, జ‌న‌సేన‌తో కూట‌మి క‌ట్టినా పార్టీ నేత‌లు సీట్లు లేక ఇబ్బంది ప‌డ్డా చంద్ర‌బాబు బుజ్జ‌గించి మ‌రీ కూట‌మిని ఎన్నిక‌ల‌కు ముందే స‌క్సెస్ చేశారు.

పీకేను వ‌దులుకుని పీక్కుంటున్నారా?
వైసీపీ చేసిన తొలి త‌ప్పు.. ప్ర‌శాంత్ కిషోర్‌ను వ‌దుల‌కుని త‌ప్పుచేయ‌డం. ఆయ‌న వేసిన అంచ‌నాలు ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి ఇదే పెద్ద దెబ్బేసింది. అదే టైంలో చంద్ర‌బాబు అదే పీకే శిష్యుడు రాబిన్‌శ‌ర్మ‌ను నియ‌మించుకుని ఆయ‌న వ్యూహాలు కొంత వ‌ర‌కు అమ‌లు చేసి స‌క్సెస్ అయ్యారు.

వ‌లంటీర్ల‌ను న‌మ్ముకుని.. చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్‌..
ముందు వ‌లంటీర్ల‌పై విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యానికి బుజ్జ‌గించారు. ప‌దివేలు ఇస్తామ‌న్నారు. ఇది వ‌ర్క‌వుట్ అయింది. అదే వ‌లంటీర్ల‌తో చాకిరీ చేయించిన వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల వేళ‌.. తర్వాత కూడా వారిని వేధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: