సిట్టింగ్ సీట్ గాన్.. హస్తం స్పీడుకు.. కారు బ్రేక్ వేయలేకపోయింది?

praveen
పాపం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కలలో కూడా ఊహించి ఉండడు. తనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షం  లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కు అన్ని చావు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో ఉన్న నేతలు అందరూ కూడా కారు పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్తున్నారు. కనీసం పార్లమెంటు ఎన్నికల్లో అయినా సత్తా చాటుతారు అనుకుంటే.. ఒక్కటంటే ఒక్కచోట కూడా గెలిచేలాగే కనిపించట్లేదు.
 అయితే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అని ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదటి విజయాన్ని సాధించింది. అది కూడా అలాంటి ఇలాంటి విజయాన్ని కాదు.. ఏకంగా మూడు లక్షల 50 వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో అటు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అది కూడా కారు పార్టీకి సిట్టింగ్ స్థానంగా కొనసాగుతున్న ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం లో ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది అని చెప్పాలి. మంచి మెజారిటీలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక ఫలితాలలో బోణి కొట్టేసింది.

 ఒకరకంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వియ్యంకుడైన రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడమే కాదు.. చివరికి ఆయనకు మంచి గొప్ప విజయాన్ని కూడా కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యారు. అయితే బిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కానీ అటు బిజెపి అభ్యర్థి తాండ్ర వెంకటరావు కానీ ఎక్కడ రామ సహాయం రఘురామిరెడ్డికి పోటీ ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలోనే అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి 3.5 లక్షలకు పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు రఘురామిరెడ్డి. మరోవైపు నల్గొండలో కూడా రఘువీర్ రెడ్డి 3 లక్షలకు పైచిలుకు ఓట్లు ఆదిత్యంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: