మంగళగిరి:లోకేష్ తగ్గేదేలే..మురుగుడుకు మంగళమేనా..?

Pandrala Sravanthi
ఎన్నో చిత్కారాలు, ఎన్నో ఈసాడింపులు.. లోకేష్ తోని కాదన్నారు.. రాజకీయాలకు పనికిరాడన్నారు.. అయినప్పటికీ పడి లేచిన కెరటంలా దూసుకుపోతున్నారు నారా లోకేష్. మంగళగిరిలో ఈసారి ఎలాగైనా మంగళ హారతులు పట్టించుకోవాలని  కంకణం కట్టుకున్నారు.  ప్లానింగ్ చేసుకొని టిడిపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి మొదటి రౌండ్లో దూసుకుపోతున్నారు. అలాంటి నారా లోకేష్ అన్ని రౌండులో దూసుకుపోతారా లేదంటే మురుగుడు లావణ్య కు ఛాన్స్ ఇస్తారా అనేది చూద్దాం. 


నారా లోకేష్.. టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈయన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మంగళగిరిలో ఈసారి భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. వైసిపి అభ్యర్థి మురుగుడు లావణ్యను మురికి కాలువలో పడేసేలా కనిపిస్తోంది. ఈయన 2013లో టిడిపిలో చేరి ఆ తర్వాత యువజన విభాగానికి నాయకత్వ పద్ధతులు తీసుకున్నారు.  2017 మార్చి 30న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అలాగే గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి పై కేవలం 5300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 


అప్పటినుంచి మంగళగిరిలోనే ఉంటూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చారు..  వైసిపి చేస్తున్నటువంటి తప్పులను ఎత్తిచూపుతూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. అలా సామాన్య ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి లోకేష్ ను ఈసారి ప్రజలు ఆదరించే పరిస్థితి కనిపిస్తోంది.  ఇప్పటికే ఒక రౌండ్ పూర్తయ్యే సరికి ఆయన 12,121 ఓట్ల లీడ్ తో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం నారా లోకేష్ కు భారీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.  మరి కొన్ని రౌండ్లలో ఎవరు విజయం సాధిస్తారనేది పూర్తిగా క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా మంగళగిరిలో లోకేష్ విజయం సాధిస్తే ఆయనకు ఎలాంటి పదవి ఇస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మరిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా లోకేష్ పంట పండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: