వెనుకంజలో మంత్రి బొత్స.. కూటమికి జలక్ ఇవ్వగలడా..?

Pulgam Srinivas
వైసిపి పార్టీలో అత్యంత కీలక నేతలలో బొత్స సత్యనారాయణ ఒకరు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇక ఈయన చీపురుపల్లి నియోజకవర్గం నుండి 2004 వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత ఈయన 2009 వ సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి మరో సారి చీపురుపల్లి నియోజకవర్గం లో గెలుపొందారు.

ఇకపోతే ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అందులో భాగంగా ఈయన 2019 వ సంవత్సరం వైసీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీపురుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దిగి మూడవ సారి ఎమ్మెల్యే అయ్యారు. మూడవ సారి గెలిచిన ఈయనకు 8 జూన్ 2019 నుండి 7 ఏప్రిల్ 2022 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గా పని చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఇక ఈయన 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా వైసిపి పార్టీ అభ్యర్థిగా చీపురుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు.

కళా వెంకట్రావు కూటమి అభ్యర్థి గా ఈ ప్రాంతం నుండి బరిలో ఉన్నారు. ఇకపోతే వైసిపి పార్టీలో కీలక నేత కావడం , మంత్రి గా పని చేసి ఉండడంతో ఈయనకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. కాకపోతే వెంకట్రావు ఈ సారి ఈయనకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అనుకున్నారు. అనుకున్నట్టే వెంకట్రావు ఈయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మొదటి రౌండ్ల ఫలితాలు వెలువడిన సమయంలో బొత్స సత్యనారాయణ వెనుకబడి ఉండగా , వెంకట్రావు ముందంజలో ఉన్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా ..? లేక బొత్స ముందుకు వస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bs

సంబంధిత వార్తలు: