కౌంటింగ్ : చేయికి.. బిజెపి బుల్లెట్ తగిలేలా ఉందిగా?

praveen
అందరూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది  తెలంగాణ లో కౌంటింగ్ ప్రారంభమైంది  ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఆదిక్యం వస్తుంది అనే విషయం పై ఉత్కంఠ ఉండగా.. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమం లోనే పోస్టల్ బ్యాలెట్ల లో ఎవరికి ఆదిక్యం వస్తుంది అనే విషయంపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అసలు కౌంటింగ్ కి ముందు మూడు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో బిజెపి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పాయి.

 ఇక ఇప్పుడు చెప్పినట్లుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవుతున్న నేపథ్యంలో అటు బీజేపీకి ఆదిత్యం కొనసాగుతూ ఉండడం గమనార్హం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ని నమ్మని ప్రజలు కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మారు  ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు ఆదిత్యాన్ని కట్టబెట్టినందుకు సిద్ధమయ్యారు  ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భాగంగా బిజెపి ఏకంగా ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం కేవలం 5 స్థానాల్లోనే లీడింగ్ లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీ ఒక్క స్థానంలో కూడా లీడ్ లో లేకపోవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి చెయ్యికి బిజెపి బుల్లెట్ తగిలేలాగే కనిపిస్తుంది.


ప్రస్తుతం కౌంటింగ్ లో వస్తున్న ఆదిక్యత  చూస్తూ ఉంటే పూర్తిగా కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన సీట్ల కంటే అటు బిజెపి కాస్త ఎక్కువ సీట్లలోనే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సాధించిందంటే తెలంగాణ రాష్ట్రంపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: