నంద్యాల పార్ల‌మెంట్ పోస్ట‌ల్‌ బ్యాలెట్స్‌లో బైరెడ్డి శ‌బ‌రి ఆధిక్యం..!

Suma Kallamadi
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు జూన్ 4న అంటే ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు మొదలయ్యింది. అయితే ఈసారి నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం బాగా హాట్ టాపిక్ గా మారింది.ఈ సారి టీడీపీ నుంచి రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి ఉద్యమ నాయకుడు లక్ష్మీనరసింహ యాదవ్ బరిలోకి దిగారు.
ప్రస్తుతం వెల్లడవుతున్న పోస్టల్ బ్యాలెట్స్‌లో ప్రకారం బైరెడ్డి శబరి లీడ్ లో ఉన్నారు. ఆమెపై నిల్చున్న ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కూడా బలమైన నాయకుడే కానీ పోస్టల్ బ్యాలెట్స్ లో మాత్రం వెనుకంజ ఉన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పుకోవచ్చు వారు మొత్తం వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేశారని తెలపవచ్చు. బైరెడ్డి శబరి రెండు రౌండ్ల తర్వాత కూడా ఆధిక్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరి కూడా 600 పైచిలుకు ఓట్ల అధికంలో కొనసాగుతున్నారు. మొత్తం మీద టీడీపీ 8 స్థానాలలో పోస్టల్ బ్యాలెట్స్‌లో లీడింగ్ లో ఉంది.
ఈ పార్లమెంటు పరిధిలో ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి, డోన్, పాణ్యం, నందికొట్కూరు (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,97,696. ప్రస్తుతానికి అయితే రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్స్ లో టిడిపి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కడపలో ఒక్క అవినాష్ రెడ్డి తప్ప మిగతా నాయకులు వెనుకంజలోనే ఉన్నారు. పిఠాపురంలో 4300 ఓట్ల తో పవన్ కళ్యాణ్ ఆధిక్యత కనబరిస్తున్నారు. ఈసారి ఆయన భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: