కౌం ' ట్రిక్స్ ' : ఓట్ల లెక్కింపులో జరిగే మోసాలివే.. ఈ 11 ఫామ్స్ గురించి అవగాహన ఉండాల్సిందే!

Reddy P Rajasekhar
ఓట్ల లెక్కింపులో మోసాలు జరుగుతాయా అనే ప్రశ్నకు కచ్చితంగా జరుగుతాయని చెప్పలేం కానీ కొంతమంది కావాలని లేదా పొరపాటున అవకతవకలకు పాల్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార యంత్రాంగం వేర్వేరు ఫామ్స్ ను వినియోగిస్తుంది. ఈ ఫామ్స్ గురించి అవగాహన కలిగి ఉండటం వల్ల మోసాల బారిన పడకుండా ఉండవచ్చు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఒకేసారి మొదలుపెడతారు.
 
అధికారులు ఫలితాల బటన్ నొక్కిన వెంటనే పోలైన ఓట్లు ప్రతి అభ్యర్థికి ఈవీఎంలో కనిపిస్తాయి. అధికారులు ప్రతి రౌండ్ లెక్కింపునకు ముందు కౌంటింగ్ ఏజెంట్లతో 17 సీ ఫామ్ లో తప్పనిసరిగా సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రౌండ్ల వారీగా ఫలితాలను ఫామ్ 20లో నమోదు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్, మీడియా కేంద్రాలకు వాటిని పంపించడం జరుగుతుంది.
 
ఫామ్ 18 కౌంటింగ్ ఏజెంట్ నియామక పత్రం కాగా ఎన్నికల ఆర్వో జారీ చేసిన ఈ పత్రం ఉంటే మాత్రమే ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎనగ్జర్ 38 ఫామ్ ను ఓట్ల లెక్కింపునకు నియమితులైన పర్యవేక్షకులు, సహాయకులకు ధృవపత్రం జారీ చేయడానికి వినియోగిస్తారు. ఎనగ్జర్ ఎ ఫామ్ లో ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ల వివరాలు ఉంటాయి.
 
ఎనగ్జర్ బి ఫామ్ ను వీవీ ప్యాట్లలోని స్లిప్పుల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎన్నికల పరిశీలకుడు ధృవీకరించే పత్రంగా ఇస్తారు. ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడే ఫలితాలను ఫామ్ 21సీలో నమోదు చేస్తారు. ఫామ్ 21ఈలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవరు విజయం సాధించారో పూర్తి వివరాలు ఉంటాయి.
 
ఫామ్ 22 విజయం సాధించిన అభ్యర్థికి ఎన్నికల అధికారి జారీ చేసే ధ్రువపత్రం కావడం గమనార్హం. ఈ ఫామ్ ద్వారా చట్టసభల్లో సభ్యులుగా ఎంపికవుతారు. ఎనగ్జర్ 58లో పార్ట్ 1లో పోలింగ్ బూత్ ల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి. పార్ట్2 లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కింపు, ఆధిక్యాలు, ఫలితాలు, ఇతర వివరాలు ఉంటాయి.
 
ఎనగ్జర్ 39 లో తుది ఫలితం వివరాలు సమగ్రంగా ఉంటాయి. ఈ ఫామ్ లో ఓట్ల ఆధిక్యతలు నోటాతో పాటు పొందుపరుస్తారు. ఆర్వో సంతకం అనంతరం ఈ వివరాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఓట్ల లెక్కింపులో ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఒకరికి బదులుగా మరొకరికి లెక్కించే ఛాన్స్ ఉంటుంది. ఈ ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: