డబ్బంటే ఇంత కక్కుర్తా... యాంకర్ సుమ ఏం చేసిందంటే .??

Suma Kallamadi
తెలుగు బుల్లితెర యాంకర్ సుమ కనకాల ఒకప్పుడు టీవీ షోలు మాత్రమే చేసేవారు కానీ ఇప్పుడు అన్ని సినిమా ఈవెంట్లలో కనిపిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఆమె కెరీర్ లైఫ్ గడిపేస్తున్నారు. ఏ షోలోనైనా ఆమె సూపర్ చలాకీగా ఉంటారు. కామెడీ పంచులు ఆమె నోట్లో నుంచి అప్రయత్నంగా జాలు వారుతుంటాయి. ఆమె కామెడీ టైమింగ్ ఫర్ఫెక్ట్ గా ఉండటం వల్ల చాలామంది సినిమా మేకర్స్ సుమనే మూవీ ఫంక్షన్లకు హోస్ట్ గా తీసుకుంటున్నారు.
అయితే ఎన్ని సినిమా ఈవెంట్లు, ఫంక్షన్ అవార్డులు హోస్ట్ చేసే అవకాశం వచ్చినా ఆమెకు సరిపోనట్లు ఉంది. అందుకేనేమో డబ్బులు అంటే చాలా కక్కుర్తి అన్నట్లు ఆమె ఇటీవల ఒక కోరిక కోరారు. కాకపోతే అది ఒక ప్రోగ్రామ్‌ ప్రోమోలో భాగంగా మాట్లాడారు. ఈ టాలెంటెడ్ యాంకర్ ఈటీవీలో "సుమ అడ్డా" షోకు హోస్ట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ ప్రతి శనివారం రాత్రిపూట టెలికాస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు టైమింగ్స్ మార్చేశారు. దానిని మంగళవారం నుంచి ప్రసారం చేస్తామని ప్రకటించారు. మారిన ఈ టైమింగ్స్ ను తెలియజేయడానికి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ప్రకారం ఈ షోకు "లవ్ మీ" మూవీ హీరో హీరోయిన్లు వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి అతిథులుగా వచ్చారు.
 మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి యాంకర్ సుమ హనుమంతుడికి పూజలు చేస్తూ కనిపిస్తారు. ఇంతలోనే ఒకరు హనుమంతుడి వలె ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. "ఏంటమ్మా నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కదా ఉండాల్సింది?" అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా "మీ దయతో మంగళవారం కూడా వినోదాన్ని పంచుదాం అనుకుంటున్నాను స్వామి, బ్లెస్స్ చేయండి" అని సుమ అంటారు. దాంతో తధాస్తు తల్లి అని ఆంజనేయస్వామి బదులిస్తారు.
ఆ ఆశీస్సులు లభించినా కూడా సుమ సాటిస్ఫై అవ్వరు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా సక్సెస్ ఫంక్షన్లు అన్నీ కూడా తనకే రావాలని కోరుకుంటారు. దాంతో ఆంజనేయ స్వామి ఆగ్రహించినట్లు "చేతిలో ఏముంది? గదా కదా! దాన్ని ఇచ్చుకొని కొడతా" అని వార్నింగ్ ఇస్తారు. దాంతో సుమ మొహం చిన్నబోతుంది. ఈ ప్రోమో చూసినా చాలామంది అంత కక్కుర్తి ఎందుకు అని కామెంట్లు పెడుతున్నారు. పెద్దవారికి అవకాశాలు ఇవ్వచ్చుగా అని ఆమెకు సున్నితంగా చురకలు అంటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: