ఏపీ: ఆ సంస్థనే టార్గెట్ చేస్తున్న టిడిపి ప్రతినిధులు..!

Divya
నిన్నటి రోజున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సైతం ఎన్నో సర్వే సంస్థలు విడుదల చేశాయి.. అయితే అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్న సర్వే ఏమిటంటే ఆరా మస్తాన్ సర్వే.. ఈ సర్వే వైసిపి పార్టీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని తెలియజేయడంతో ఎల్లో మీడియా టిడిపి నేతలు సైతం ఈ సంస్థ పైన విరుచుకుపడుతున్నారు.. తద్వారా ఆ సమస్త సర్వే ఫలితాల పైన ఎంతగానో భయపడుతున్నారు టిడిపి నేతలు. దీంతో ఈ సంస్థ విశ్వసనీయత గురించి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆరా మస్తాన్ ఇదే రీతిలో ఫలితాలను కూడా చాలా క్లుప్తంగా వివరించి మరి తెలియజేశారు. ఆ తర్వాత కూడా పలు ఎన్నికలలో అతను చెప్పిన దానికి వాస్తవ ఫలితాలకు సరి చూడడం కూడా జరిగింది.దీంతో చాలామంది ప్రజలకు నమ్మకం కూడా ఏర్పడింది. అంతేకాకుండా గణాంకాలతో లెక్కలు వేసి మరి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని వివరణ కూడా ఇచ్చారు ఆరా మస్తాన్.. దీంతో టీడీపీ అధికార ప్రతినిధుల సైతం తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

ముఖ్యంగా టిడిపి టికెట్ ఆశించినప్పటికీ అది ఇవ్వలేదని అక్కస్సుతోనే.. ఆరా మస్తాన్ టిడిపి పార్టీ అధికారంలోకి రాదని చెబుతున్నారు అంటూ పలువురు నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవేళ టిడిపి కూటమికి 160 సీట్లు వస్తాయని .. మిగిలిన 15 స్థానాలు కూడా గెలుచుకొని అవకాశం ఉందని చెప్పి ఉంటే టిడిపి నేతలు కార్యకర్తలు పొగుడుతూ ఉండేవారని చెప్పవచ్చు. చాలా సర్వేలు టిడిపి కూటమికి 161 వస్తాయంటే కనీసం టిడిపి నేతలైన నమ్ముతారా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి కదా అంటూ పలువురు నేతలు తెలుపుతున్నారు. వారికి అనుకూలంగా చెబుతే చాలు జై కొడతారు లేకపోతే ఛీ కొడతారు అన్నట్టుగా కనిపిస్తోంది.. కేవలం ఆరం మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి భయపడుతున్నారు అంటే కచ్చితంగా వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుందనడానికి ఇదే ఉదాహరణ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: