వైసీపీ గెలిస్తే జగన్ వాళ్ల నోరు నొక్కేస్తారా.. వాళ్లకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ మళ్లీ గెలిస్తే జగన్ టార్గెట్ ఏంటి అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. పదేపదే తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న వాళ్లపై జగన్ ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారని సమాచారం అందుతోంది. తనపై విమర్శలు చేసేవాళ్ల నోర్లు నొక్కేసేలా జగన్ అడుగులు పడనున్నాయని ఏపీ అభివృద్ధికి అడ్డుపడే వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
 
రాష్ట్రంలో వైసీపీ గెలిస్తే అసెంబ్లీ సమావేశాల్లో లోకేశ్, పవన్, రఘురామ కృష్ణంరాజులలో ఎవరు గెలిచినా వాళ్ల నోర్లు వైసీపీ నొక్కేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి గెలిస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని కూటమి ప్రణాళికలు మాత్రం వేరే విధంగా ఉండబోతున్నాయని భోగట్టా. రోజా నగరిలో ఓడిపోయే అవకాశాలు ఉండటం కూటమికి ప్లస్ అవుతోంది.
 
రోజా అంటే ఫైర్ బ్రాండ్ అని ఆమె విమర్శలకు ధీటుగా బదులివ్వడం తమ వల్ల కాదని చాలామంది టీడీపీ నేతలు భావిస్తారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా హ్యాట్రిక్ కు బ్రేకులు పడటం ఖాయమని తేలిపోయింది. పార్టీ గెలిస్తే ఒక విధంగా ఓడితే మరో విధంగా జగన్ వ్యూహ, ప్రతివ్యూహాలు ఉండబోతున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
ఈ ఎన్నికల ఫలితాలు జగన్, చంద్రబాబులలో ఎవరికి భారీ షాకివ్వబోతున్నాయో చూడాల్సి ఉంది. 90 సీట్లకు అటూఇటుగా ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ అధికారాన్ని కొనసాగించడం సులువు అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎవరు గెలిచినా 100 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే బాగుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకునే అదృష్టం ఎవరికి సొంతమవుతుందో చూడాలి. కూటమి నేతలు, వైసీపీ నేతలు తాము విజయం సాధిస్తామో లేదో అని తెగ టెన్షన్ పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ ఏ పార్టీకి ప్లస్ అవుతుందో ఏ పార్టీకి మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: