కొత్త సినిమా స్టార్ట్ : జగన్ కి అధికారం ఓకే... కానీ అసెంబ్లీలో అంత మందితో ఫైట్ చేయాలా..?

Pulgam Srinivas
ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు రెండు , మూడు నెలల హోరాహోరీ ప్రచారాల తర్వాత మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ సెగ్మెంట్ లకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల కానున్నాయి. ఇకపోతే ఇప్పటికే దేశమంతా లోక్సభ స్థానాలకు సంబంధించిన అన్ని విడతల పోలింగ్ పూర్తి అయింది. దానితో నిన్న అనగా జూన్ 1 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ను అనేక సంస్థలు విడుదల చేశాయి. ఆ సంస్థల ప్రకారం ఈ సారి పోటీలో ఉన్న వైసిపి మరియు కూటమి ఇద్దరిలో ఏ వర్గం గెలుస్తుంది అనే దానిపై పెద్దగా క్లారిటీ రాలేదు.

కాక పోతే కొన్ని సర్వేలు మాత్రం వైసిపి దాదాపు 100 కు పైగా స్థానాలను దక్కించుకొని మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ప్రకటించాయి. అలాగే దాదాపు అన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు కుమారుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేత అయినటువంటి నారా లోకేష్ , తెలుగుదేశం పార్టీలో మరో కీలక వ్యక్తి అయినటువంటి బాలకృష్ణ , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నలుగురు కూడా భారీ మెజారిటీతో గెలుపొందనున్నట్లు ప్రకటించాయి.

దానితో ఒక వేళ జగన్ కావలసినన్ని సీట్లను దక్కించుకొని అధికారంలో ఉన్నా కూడా అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ , బాలకృష్ణ , పవన్ తో పోటీ పడవలసి ఉంటుంది. పోయినసారి చంద్రబాబు నాయుడు , బాలయ్య గెలుపొందారు. కానీ తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తి అయినటువంటి నారా లోకేష్ , జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోయారు. ఇక ఈసారి వీరిద్దరితో కూడా జగన్ అసెంబ్లీ లో ఫైట్ చేయవలసి ఉంటుంది. మరి జగన్ అధికారంలో ఉన్నా కూడా ఈ నలుగురిని ఎదుర్కోవడంలో చాలా ఫైట్ చేయవలసి ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: