
ఎగ్జిట్ పోల్స్ : ఆరా మస్తాన్ సర్వే.. బిఆర్ఎస్ పరువు పోయినట్టేనా?
ఈ క్రమంలోనే ఓటురు మహాశేయులను ఆకట్టుకుని మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదిపాయి. ఈ క్రమంలోనే ఓటర్లు కూడా మే 13వ తేదీన ఓటు వేసి ఇక అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్నది తెల్చేశారు. అయితే ఎవరికి మెజారిటీ వస్తుంది అనే విషయంపై మాత్రం తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తే ఇక ఎవరికి మెజారిటీ వస్తుంది అనే విషయంపై ఒక అంచనాకు రావచ్చని అటు ఎంతో మంది ప్రజలు కూడా నమ్మారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. వివిధ సంస్థల నిర్వహించిన సర్వేల్లో సంచలన ఫలితాలు బయటపడుతున్నాయి.
అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఆరా మస్తాన్ సర్వే ఎంతో కీలకంగా మారుతూ ఉంటుంది. ఆయన ఎగ్జిట్ పోల్స్ లో వేసిన అంచనా ఇక నిజమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను ఆయన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇక బిజెపి ఈసారి మెజారిటీ గెలుచుకుంటుందని.. ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలలో కమలం పార్టీ జెండా ఎగురుతుందని.. ఎంఐఎం ఎప్పటిలాగానే ఒక స్థానాన్ని దక్కించుకుంటుందని తెలిపారు. అయితే ప్రతిపక్ష హోదాలో బిఆర్ఎస్ మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోదు అన్న విషయాన్ని చెప్పారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలను చూసి బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు.