జన్మత్ సర్వే ఎగ్జిట్ పోల్ లెక్కలివే.. ఏపీలో ఫ్యాన్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Reddy P Rajasekhar
ఏపీలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రముఖ సంస్థల నుంచి ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ప్రముఖ సంస్థలలో ఒకటైన జన్మత్ సర్వే రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్ కు తిరుగులేదని వెల్లడించింది. ఏపీలో వైసీపీ 95 నుంచి 103 స్థానాల్లో విజయం సాధిస్తుందని కూటమి కేవలం 67 నుంచి 75 స్థానాలకు మాత్రమే పరిమితవుతుందని తేల్చి చెప్పింది. జన్మత్ సర్వే లెక్కలు వైసీపీలో జోరును పెంచేశాయి.
 
జన్మత్ సర్వే ఫలితాలతో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ సంస్థకు సంబంధించిన నిజమైన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సైతం వైసీపీకి భారీ విజయం దక్కనుందని తెలుస్తోంది. 2019 స్థాయిలో కాకపోయినా క్లియర్ మెజారిటీతోనే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు.
 
రాష్ట్రంలో మరోసారి జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసి ఇప్పటికే సంక్షేమ పథకాలను పొందిన వాళ్లు మళ్లీ తాము మంచి పరిపాలన చూడబోతున్నామని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాలలో, ఉత్తరాంధ్ర జిల్లాలలో పూర్తిస్థాయిలో వైసీపీకి అనుకూల ఫలితాలు రావడం ఖాయమని తేలిపోయింది. మిగతా జిల్లాలలో పరిస్థితులు మరీ దారుణంగా అయితే లేవు.
 
వైసీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మరో 30 సంవత్సరాల పాటు తమ పార్టీకి ఎదురు లేదని నమ్ముతోంది. ఆ నమ్మకమే నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైసీపీకి 100 స్థానాలు వచ్చినా ఆ పార్టీకి మేలు జరిగినట్టేనని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే కూటమి నేతలు మళ్లీ పొత్తు దిశగా అడుగులు వేసే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు. మరో మూడు రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలు సైతం జన్మత్ ఫలితాల తరహాలోనే దాదాపుగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. జగన్ నమ్మకం ఏపీ ఎన్నికల విషయంలో నిజమైనట్టేనని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: