కేకే సర్వే : విశాఖపట్నంలో వైసీపీని టోటల్ గా డామినేట్ చేసిన కూటమి..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు గాను పోలింగ్ జరిగింది. ఇక ఈ పోలింగ్ జరిగిన తర్వాత పోయిన సారి కంటే ఈ సారి ఎక్కువ శాతం ఓటింగ్ శాతం నమోదు కావడంతో గెలుపు అవకాశాలు మాకే ఎక్కువ అంటే , మాకు ఎక్కువ అని ఇటు వైసిపి వర్గం , ఇటు కూటమి వర్గం చెబుతూ వస్తోంది. ఇలా చెబుతున్న సమయంలో ఎలక్షన్ ఫలితాలు విడుదల కావడానికి సమయం అతి దగ్గర పడిన నేపథ్యంలో ఈ రోజు చాలా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్టు ను విడుదల చేయబోతున్నాయి.

అందులో భాగంగా కే కే సర్వే కూడా తన రిపోర్టు ను విడుదల చేసింది. దాని ప్రకారం ఈయన విశాఖపట్నం కు సంబంధించిన రిపోర్ట్ ను తాజాగా చెప్పుకొచ్చారు. ఇకపోతే మొత్తం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో పోయిన సారి వైసీపీ పార్టీ తన జోష్ ను చూపించి చాలా సీట్లను దక్కించుకుంది. ఇకపోతే టిడిపి మాత్రం ఈ ప్రాంతంలో పోయిన సారి పెద్దగా జోష్ ను చూపించలేక పోయింది.

దానితో ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి అని వైసిపి నేతలు అనుకున్నారు. కానీ కేకే సర్వే ప్రకారం ఈ సీన్ అంత రివర్స్ అయ్యింది. కేకే సర్వే ప్రకారం విశాఖపట్నం లో 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే తొమ్మిది లో తొమ్మిది కూటమి దక్కించుకోనున్నట్లు , వైసీపీ కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. మరి ఆయన చెప్పిన సర్వే నిజం గానే నిజం అయినట్లు అయితే విశాఖపట్నం లో వైసీపీ ని కూటమి టోటల్ గా డామినేట్ చేసినట్లే అవుతుంది. మరి కేకే సర్వే ఎంత స్థాయిలో నిజం అనేది తెలియాలి అంటే జూన్ 4 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk

సంబంధిత వార్తలు: