ఎగ్జిట్ పోల్ 2024 : గెలుపు పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయంటే..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పలు చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసాయి..ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రం అంతటా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. రాష్ట్రంలో  ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అనేది చాలా ఆసక్తికరంగా మారింది.గెలుపుపై ఇరు పార్టీ నాయకులు ఎంతో ధీమాగా వున్నారు.గెలుపుపై ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాయి..రెండోసారి అధికారంలోకి వస్తున్నామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంబరాలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.అలాగే ప్రతిపక్ష కూటమి పార్టీ అయిన టీడీపీ ఈసారి తమ విజయం ఖాయం అని చెప్తుంది.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఈ సారీ అధికారం ఖాయమని ఆ పార్టీ నాయకులు ఎంతో ధీమాగా వున్నారు.. దీనిపై ఎవరి లెక్కలు వారికున్నాయి. ఇంతకీ ఆయా పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. 

రాష్ట్రంలో మరోసారి గెలుపు మాదే అంటున్న వైసీపీ ధీమాకు చాలా కారణాలు వున్నాయి.ఐదేళ్ల పాటు అమలు చేసిన నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా అమలు చేయడం. అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటికే పెన్షన్ స్కీమ్ అమలు చేయడం. ఆంధ్రప్రదేశ్ లో 4 సీపోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటివి అభివృద్ధిలో భాగంగా వైసీపీ చెబుతుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామాల్లో విలేజ్ క్లినిక్ లు, రైతుభరోసా కేంద్రాలు వంటివి ప్రజలకు ప్రజా పాలన దగ్గర చేశాయని వైసీపీ ధీమాగా వుంది.అలాగే ఈ సారి అధికారం తమదే అంటున్న కూటమికి కూడా కొన్ని కారణాలు వున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటం.అలాగే నారా లోకేశ్ పాదయాత్ర మరియు చంద్రబాబు అరెస్ట్ తో పెరిగిన సానుభూతి వంటివిముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు.. అలాగే వైసీపీ అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్లడం వంటివి. అలాగే సూపర్ సిక్స్ పేరుతో పేదల భవిష్యత్ మార్చడం వంటివి టీడీపీ కూటమికి కలిసివచ్చే అంశాలుగా వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: