అటు వర్మపై జనసైనికులు, ఇటు పవన్ పై తెలుగు తమ్ముళ్ల ఏడ్పులు?

Purushottham Vinay
ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందే టీడీపీ, జనసేన నేతల మధ్య అధిపత్యపోరు సాగుతోంది. పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి కూడా టీడీపీ, జనసేన పార్టీల నేతల మధ్య నువ్వా నేనా అనే అధిపత్య అంతర్యుద్ధం కొనసాగింది.జనసేన పార్టీలో మొదటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడిన జనసేన నేతలకు టికెట్లు దక్కలేదు. టీడీపీ నుంచి వచ్చిన నేతలకే జనసేన పార్టీ టికెట్లు ఇవ్వడంతో చాలామంది నేతలు పార్టీ నుంచి వీడారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో జనసేన ఇంకా టీడీపీ నేతల మధ్య అధిపత్య పోరు సాగుతోందని తెలుస్తోంది.పిఠాపురం టీడీపీ నేత వర్మ ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడంతో పవన్‌ కళ్యాణ్ కు టికెట్ దక్కింది. పవన్ కల్యాణ్ గెలుపు టీడీపీ నేత వర్మ పై ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవడం ఆయన వ్యక్తిగత చరిష్మాకు మైనస్‌గా మారింది. మరోవైపు వర్మ బరిలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఇంకా క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైందని కలలు కంటున్న నేతల మధ్య అధిపత్య పోరు మొదలైంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..అక్కడ నెంబర్ 2 స్థానం కోసం ఇద్దరి నేతల మధ్య పోరు సాగుతున్నట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం టికెట్‌ ని త్యాగం చేశారు వర్మ. ఒకవేళ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానిక నేత కాబట్టి ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని టీడీపీ తమ్ముళ్లు పవన్ పై ఏడుస్తున్నారు. మరోవైపు నాగబాబుకు కూడా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ఇస్తారని ఏడుస్తున్నారు. పైగా దీనికి తోడు పవన్ కల్యాణ్ గెలుపు నా వల్లే అని వర్మ టీవీ డిబేట్లలో చెబుతున్నారని జనసైనికులు వర్మపై పడి ఏడుస్తున్నారు.అందరు అనుకున్నట్టు పవన్ కల్యాణ్ గెలిచినా కానీ ఆ క్రెడిట్ వర్మ కొట్టేస్తారని జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరి నాయకుల్లా వర్మ కూడా రిలాక్స్డ్ గా ఉండకుండా ఎందుకు ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు లేకపోతే వర్మ దగ్గరుండి దెబ్బ కొట్టి దానికి కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మీడియా డిబేట్లతో కవర్ చేస్తున్నారా అంటూ జనసేన పార్టీ కార్యకర్తల నుంచి సందేహాలు వ్యక్తం కావటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: