వైసీపీ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ బాధ భరించాల్సిందేనా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన రానుంది. ఈ తేదీ కోసం ఆంధ్ర రాష్ట్ర నాయకులు , కార్యకర్తలతో పాటు జనాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంత లోపు ఏ పార్టీని అభిమానించే వ్యక్తులు రేపు రాబోయే రిజల్ట్ లో మా పార్టీనే అధికారం లోకి రాబోతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎలక్షన్ ల తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఆ ఈవెంట్ లో భాగంగా జగన్ మాట్లాడుతూ ... పోయినసారి మాకు 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఆ ఎలక్షన్ ల ముందు మేము అలా చెబితే ఎవరూ నమ్మలేదు. కానీ వచ్చాయి. ఇప్పుడు చెబుతున్న మాకు పోయిన సారి కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది అని అన్నారు. ఇక ఈయన అలా అనడంతో అప్పటి వరకు కాస్త నిరుత్సాహం తో ఉన్న ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు , అభిమానుల్లో జగన్ అదిరిపోయే స్థాయి ఉత్సాహాన్ని నింపాడు.

ఇది ఇలా ఉంటే ఒక వేళ జగన్ అధ్యక్షతన వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం ఓ బాధ భరించాల్సి వచ్చేలా కనిపిస్తుంది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ , పురంధరేశ్వరి ఈ కూటమిలో అత్యంత కీలక వ్యక్తులు.

ఇకపోతే ఈ నలుగురిలో నలుగురు కూడా ఈ సారి గెలిచి అసెంబ్లీ లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వీరు నలుగురు కూడా గెలిచి అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచినా కూడా వీ నలుగురిని అసెంబ్లీలో చూసే బాధలు మాత్రం భరించాల్సిందే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కూటమిలో అత్యంత కీలక నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ , పురంధరేశ్వరి ఈ నలుగురు గెలుస్తారో..? గెలిస్తే ఏ స్థాయిలో గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: