జ‌య‌హోః జ‌గ‌న్‌... అన్నీ స‌ర్వేలు వైసీపీకే.. దారుల‌న్నీ వైజాగ్ వైపే...?

RAMAKRISHNA S.S.
- జాతీయ‌, ప్రాంతీయ స‌ర్వేల్లో వైసీపీకే మొగ్గు
- క్రెడిబులిటీ స‌ర్వేల్లోనూ జ‌గ‌న్‌కే జ‌నాదార‌ణ‌
- జెండాలు జ‌త‌క‌ట్టే ప్ర‌తిప‌క్షాలు వ‌ద్దు.. జ‌నం గుండెల్లో గుడిక‌ట్టుకునే జ‌గ‌నే ముద్దంటోన్న ఆంధ్ర ప్ర‌జ‌..!
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీ ఎన్నిక‌లు ముగిశాయి. మ‌రి కొద్ది గంట‌ల్లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అంద‌రిలోనూ ఒక్క‌టే టెన్ష‌న్‌... ఇక ఫ‌లితాల కోసం మ‌రో మూడు రోజుల టైం మాత్ర‌మే ఉంది. ఈ నెల 4వ తేదీ ఎప్పుడు వ‌స్తుందా ? అని అంద‌రూలోనూ ఉత్కంఠ అయితే మామూలుగా లేదు. మ‌రో వైపు జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వైజాగ్‌లో ఏర్పాట్లు కూడా ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. వైసీపీ వాళ్ల‌లో కాన్పిడెన్స్ అయితే మామూలుగా లేదు. ఆంధ‌ప్ర‌దేశ్‌లో మెజార్టీ ప్ర‌జ‌ల్లో ఎవ‌రి నోట విన్నా.. ఎక్క‌డ చూసినా కూడా జ‌య‌హోః జ‌గ‌న్ అన్న నామ‌స్మ‌ర‌ణ మోర్మోగుతోంది.

ప‌లు జాతీయ సంస్థ‌ల స‌ర్వేల‌తో పాటు ప్రాంతీయంగా బాగా పాపుల‌ర్ అయిన కొన్ని సంస్థ‌ల స‌ర్వేల్లోనూ జ‌గ‌న్ మ్యాజిక్ ఫిగ‌ర్ దాటి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే రేంజ్‌లో సీట్లు ద‌క్కించుకుంటార‌ని... వ‌రుస‌గా ఏపీకి రెండోసారి కూడా జ‌గ‌నే సీఎం అవుతార‌ని చెప్పేస్తున్నాయి. టైమ్స్ నౌ లాంటి పాపుల‌ర్ సంస్థ‌లు ఇప్ప‌టికే చేస్తోన్న స‌ర్వేల‌లో మ‌రోసారి జ‌గ‌న్‌కు క్లీయ‌ర్ మెజార్టీ వ‌స్తుంద‌ని తేట‌తెల్ల‌మైంది. ఇక ప్రాంతీయంగా బాగా క్లిక్ అయిన రేస్ స‌ర్వేలో వైసీపీకి 100  + సీట్లు వ‌స్తున్నాయి. నాగ‌న్న స‌ర్వే అయితే వైసీపీకి 110 + సీట్లు వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పేసింది.

ఇక తెలుగు నాట బాగా పాపుల‌ర్ అయిన ఆరా మ‌స్తాన్ స‌ర్వే అధికారికంగా బ‌య‌ట‌కు రాక‌పోయినా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం క‌ష్ట ప‌రిస్థితుల్లో కూడా వైసీపీ 93 సీట్ల‌కు త‌గ్గ‌కుండా సాధించి అధికారంలోకి వ‌స్తుంద‌ని .. అదే పార్టీ వేవ్ ఉంటే 110 + వ‌ర‌కు సీట్లు వ‌స్తాయ‌ని చెపుతోన్న‌ట్టు టాక్ ? ఇక ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు YNR నుంచి మిత్రుల ద్వారా అందిన స‌మాచారం ప్ర‌కారం వైసీపీకి 95 సీట్లు త‌ప్ప‌క వ‌స్తాయ‌ని.. మ‌రో జ‌గ‌నే సీఎం అని తేలింద‌ట‌. YNR అంచ‌నాల ప్ర‌కారం క‌నీసం 30 సీట్ల‌లో వైసీపీకి వెయ్యి నుంచి 5 వేల లోపు మెజార్టీ వ‌స్తుంద‌ని.. ఇవే కూట‌మి ఆశ‌ల‌ను తారుమారు చేస్తున్నాయ‌ట‌.

ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల రోజు... ఎన్నిక‌ల త‌ర్వాత చేయించిన ఐదు స‌ర్వేల్లోనూ వైసీపీకి 99 నుంచి 121 సీట్ల మ‌ధ్య‌లో వ‌స్తాయ‌ని.. 15 - 17 ఎంపీ సీట్లు గ్యారెంటీ అని తేలింద‌ట‌. అందుకే వైసీపీ వాళ్లు గెలుపుపై ధీమాతో ఉండ‌డంతో పాటు మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని.. విశాఖ‌లో జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకార ఏర్పాట్ల‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏదేమైనా చిన్న వ‌య‌స్సులోనే సొంతంగా పార్టీ పెట్టి రెండోసారి అధికారంలోకి రావ‌డం అంటే దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే సెన్షేష‌న్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: