
అవసరమైతే ఆ కూటమికి జగన్ మద్దతు ప్రకటిస్తారా..??
ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మమతా బెనర్జీ తమ పార్టీ ఇండియా కూటమికు మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైతే ఏం చేయడానికి అయినా కూటమి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి బిజూ జనతాదళ్ మద్దతును కూడా కోరుతోంది.
ఇండియా కూటమికి చెందిన కొందరు సీనియర్ నాయకులు ఆయా పార్టీ నేతల వద్దకు వెళ్లి తమ సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నారట. కూటమి నుంచి ఒక సీనియర్ నేత ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా సంప్రదించారట. అవసరమైతే తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారట. ఏపీలో వైసీపీ 10-12 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవచ్చని, ఈ సీట్లు కేంద్ర పార్టీలకు కీలకం కావచ్చని అంచనాలు వేస్తున్నారు.
గత ఐదేళ్లలో, వైస్సార్సీపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించింది. బీజేపీ నాయకుల రెచ్చగొట్టేలా చంద్రబాబుతో కలిసినా విమర్శలు చేసినా, బీజేపీని విమర్శించడం మానుకుంది. కానీ పోలింగ్ తేదీన కూడా బీజేపీ చాలా ఇబ్బంది పెట్టేసింది. ప్రచార సమయంలో కూడా అలాగే సమస్యలను క్రియేట్ చేసింది. అందుకే బీజేపీపై జగన్ కోపం పెంచుకున్నట్లు అనిపించింది.
ఎన్నికల సమయంలో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతివ్వబోనని స్పష్టం చేశారు. "వైసీపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి మా పార్టీ మద్దతివ్వదని, తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి బీజేపీ విశ్వసనీయతను కోల్పోయింద"ని జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ కీలుబొమ్మగా మారిందని, ఎన్నికల తర్వాత తమ పార్టీ బీజేపీకి మద్దతివ్వదని వైసీపీ అధినేత స్పష్టం చేశారు.
గత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి అనుకూలమైన పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తానని, ప్రత్యేక హోదాపై కూడా డీల్ కుదుర్చుకుంటానని జగన్ ప్రకటించారు. I.N.D.I.A నేతలు తనను సంప్రదించగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంపైనే తాను మద్దతు ఇవ్వడం ఆధారపడి ఉంటుందని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ ఇప్పటికే వాగ్దానం చేసిందని, జగన్ సందేహాలను నివృత్తి చేసిందని ఇన్సైడ్ టాక్. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే జాతీయ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని జగన్ సూచించారు.