విద్యార్థుల కోసం జగన్ మరో సంచలన నిర్ణయం.. జగన్ కు ఎవరూ సాటిరారుగా!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో వంటకాలు అద్భుతంగా ఉండేలా జగన్ సర్కార్ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకోగా ఆ నిర్ణయాలు అమలవుతూ ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో బెనిఫిట్ కలుగుతోందనే సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వంట వాళ్లకు జగన్ సర్కార్ తాజ్ హోటల్ షెఫ్ లతో స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తోందని సమాచారం.
 
విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందడంతో పాటు వంటకాలు రుచిగా ఉండేలా జగన్ సర్కార్ అడుగులు పడుతున్నాయి. హోటల్ తాజ్ షెఫ్ లతో జగన్ సర్కార్ ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. మధ్యాహ్న భోజన వర్కర్లకు పిల్లలకు భోజనం రుచిగా వండేలా తాజ్ హోటల్ షెఫ్ లు చిట్కాలు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో జగన్ కనబరిచిన శ్రద్ధను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని తెలుస్తోంది.
 
గత ఐదేళ్లలో సీఎం జగన్ అమలు చేసిన ఎన్నో పథకాలు పేదల జీవితాలను మార్చేశాయనే చెప్పాలి. విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా నాడు నేడు స్కీమ్ తో జగన్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
 
జగన్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో విద్యార్థుల నుంచి సైతం పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎం జగన్ వల్ల ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటున్నామని చాలామంది విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోయాయనే సంగతి తెలిసిందే. జగన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: