మైండ్ గేమ్ స్టార్ట్.. రేవంత్ ఒకలా.. కేసీఆర్ మరోలా?

praveen
తెలంగాణలో ఎప్పుడు ఏం జరగబోతుంది అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారిపోతూనే ఉన్నాయి. ఇక ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలస వెళ్తున్న నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఇక గులాబీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

 ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారు పార్టీలోకి ఆహ్వానించి ఎలాగైతే హస్తం పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు కెసిఆర్ ప్రయత్నించారో.. ఇక ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక అదే చేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీలోని కీలక నేతలను సిట్టింగ్ ఎంపీలను సైతం హస్తం గూటికి చేర్చుకున్నారు. ఇక మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారును వదిలి చేయి అందుకున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరి కొంతమంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని హస్తం పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా చెబుతూ ఉన్నారు.

 ఎప్పుడు ఏం జరగబోతుంది అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మైండ్ గేమ్ ప్రారంభమైంది అన్నది తెలుస్తుంది. 26 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్లో చేరగా హస్తం పార్టీ నేతలు చెప్తున్నట్లుగా మరో 26 మంది ఆ పార్టీలోకి వెళ్లారంటే.. ఇక బిఆర్ఎస్ కు విపత్కర పరిస్థితులు తప్పవు. ఇలాంటి సమయంలో మైండ్ గేమ్ మొదలు పెట్టిన కేసీఆర్ తమతో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే బిఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇలా ఎవరికి వారు మాటలతో మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల  తర్వాత ఏం జరగబోతుంది అనే విషయంపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: