పల్లె పోలింగ్ పీక్.. టీడీపీ వీక్?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోమెజారిటీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏపీలోని పల్లెల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కడుతున్నారు. టీడీపీ అనుకూల సర్వేలలో సైతం రాష్ట్రంలో పల్లెలకు చెందిన ఓటర్ల మద్దతు వైసీపీకే ఉందని వెల్లడైందని. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా వైసీపీ సరైన వ్యూహాలతో ముందడుగులు వేయడం గమనార్హం.
 
పల్లె ఓటర్ల మనస్సులను గెలుచుకునే విషయంలో టీడీపీ వీక్ అని ఎన్నికల ఫలితాల్లో రూరల్ ఓట్లపై కూటమికి పెద్దగా ఆశలు అయితే లేవని తెలుస్తోంది. జగన్ అమలు చేసిన నవరత్నాల పథకాలలో మెజారిటీ లబ్ధిదారులు పల్లెవాసులు కావడం గమనార్హం. గ్రామాల్లోని అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబం వైసీపీ పథకాల ద్వారా లబ్ధి పొందింది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని పరిశీలించినా ఫ్యాన్ గాలి వీస్తోందని రూరల్ ఓట్లతో మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ అధికారాన్ని సులువుగానే కైవసం చేసుకోనుందని తెలుస్తోంది. జగన్, చంద్రబాబు ఎన్నికల్లో విజయం కోసం ఎన్ని అస్త్రాలు వాడాలో అన్ని అస్త్రాలు వాడేశారు. జగన్ విశ్వసనీయతతో  చేసిన మంచిని చెప్పి ప్రచారం చేసుకుంటే బాబు అలివి కాని హామీలను ప్రకటించి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.
 
అయితే మంచి చేసిన జగన్ కు ఓటేయాలో 2014 - 2019 మధ్య అటు అభివృద్ధి లేకుండా ఇటు సంక్షేమం లేకుండా పాలన సాగించిన చంద్రబాబుకు ఓటేయాలో తెలుసుకునే తెలివితేటలు ఓటర్లకు ఉన్నాయి. దాదాపుగా 10 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటుండగా ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు అని వాళ్లలో చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వైసీపీకి సునాయాసంగానే ఈ ఎన్నికల్లో విజయం దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకి ఫేవర్ గా ఉండబోతున్నాయని పొలిటికల్ వర్గాల్లోి వినిపిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: