ఏపీ: అమరావతి కోసమే ఆ త్యాగం చేశా: పవన్‌ కల్యాణ్‌

Suma Kallamadi
ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడంటే మూడు రోజులు మాత్రమే సమయం వున్నది. ఇక విపక్షాల ప్రచారాలు కూడా రేపటితో ముగియడంతో సుడిగాలి పర్యటనలు షురూ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రజలకు తెలియ జేశాడు. తాజాగా విజయవాడ వేదికగా మాట్లాడిన ఆయన విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది కానీ.. భాజపా అధినాయకత్వం అడిగిన ఒక్క మాటతో నేను దానిని కాదనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. భాజపా.. "మీకు అమరావతి కావాలంటే.. దానిలో మా ప్రాధాన్యం ఉండాలి కదా!" అని అడిగారట. విజయవాడలోని 3 సీట్లలో ఇద్దరు తెదేపా నేతలు ఎప్పటి నుంచో ఉండడంతో నేను త్యాగం చేశాను అని అన్నారు.
ఇక ఆ పశ్చిమ సీటుని దానం చేసినపుడు పవన్ రెండే అడిగారట. ఒకటి అమరావతి, రెండు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాలని. దానికి వాళ్లు అంగీకరించడంతో సీటును వదులుకున్నాను అని పవన్ తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నాడు. కాగా పశ్చిమలో నేను తీర్చిదిద్దిన నాయకుడే ఇప్పుడు వైకాపా మాయలో పడి నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. కానీ.. నేను ఇలాంటి వాటికి భయపడను. నేను అతడిని క్షమిస్తున్నానని పోతిన వెంకట మహేశ్‌ గురించి పరోక్షంగా పవన్‌ ఇక్కడ ప్రస్తావించడం కొసమెరుపు.
అవును, రాష్ట్రంలో అరాచక పాలన పోవాలనే.. పవన్‌ కల్యాణ్‌ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. మేమేం పదవులపై ఆశతో రాలేదు, కేవలం ప్రజా సేవ చేయడానికి వచ్చాం. విజయవాడలోని ఈ పంజాసెంటర్‌ను వైకాపా మూకలు గంజాయికి కేంద్రంగా మార్చివేశాయి. చీడ పురుగుల పాలనలో మనం వున్నాం. ఈ దుష్టపాలన పోగొట్టాలంటే.. మే 13న కూటమికి ఓటేసి గెలిపించండి. పవన్‌ కల్యాణ్‌ వల్లే ఈరోజు కూటమి ఏర్పాటు సాధ్యమైంది. మళ్లీ కూటమి రాకతోనే.. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గత ఐదేళ్లలో.. తాను 130 సార్లు బటన్‌ నొక్కానంటూ చెప్పుకొంటున్న జగన్‌.. అసలు తానెంత నొక్కారో బయట పెడితే బావుంటుంది... అంటూ పవన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: