చంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌: విద్య - పాఠ‌శాల‌లు - కాలేజీలు... క్రెడిట్ నీకే జ‌గ‌న్‌

RAMAKRISHNA S.S.
- జ‌గ‌న్ పాల‌న‌లో విద్యారంగంలో దేశంలోనే 5వ స్థానం
- ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్య‌ను స‌మూలంగా మార్చేసిన హీరో జ‌గ‌న్‌
- ట్యాబులు, బైజూస్ విద్య‌, ఐబీ కంటెంట్‌తో పేదోడి లైఫ్ మార్పు
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
విద్యారంగంలో ఏపీ ఇప్పుడు దేశంలోనే టాప్ 5లో స్థానం ద‌క్కించుకుంది. కేర‌ళ‌, ఢిల్లీ, పుదుచ్చేరి త‌ర్వా త ప్లేస్‌లో ఏపీ ఉంది. దీనికి కార‌ణాలు చెప్పేముందు.. ప్ర‌స్తుతం .. ఏపీలో ఉన్న విద్యావ్య‌వ‌స్థ‌లో చంద్ర‌బా బు చేసిన సంచ‌నాలు పెద్ద‌గా ఏమీ లేవు. నిజానికి చంద్ర‌బాబు ఇచ్చింది కూడా లేదు. ఎందుకంటే.. అస‌లు దీనిని చంద్ర‌బాబు పెద్ద విష‌యంగా కూడా ప‌రిగ‌ణించ‌లేదు. ఎంత‌సేపూ..టీచ‌ర్ల నియామ‌కంపైనే ఆయ‌న దృష్టి పెట్టారు. ఇంత‌కుమించి ఏం చేస్తాం అని కూడా భావించి ఉండొచ్చు.

కానీ, జ‌గ‌న్ రాక‌తో.. విద్యా వ్య‌వ‌స్థ‌లో స‌మూల‌మైన మార్పులు వ‌చ్చాయి. భ‌వ‌నాల నుంచి విద్య పాఠ్యాంశా ల వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ అనేక సంచ‌ల‌నాలు తీసుకువ‌చ్చారు. నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా.. పాఠ‌శాల‌ల రూపు రేఖ‌లు మార్చేశారు. విద్యార్థులు కింద కూర్చునే ప‌రిస్థితి నుంచి బ‌ల్ల‌లు, బెంచీల వ‌ర‌కు తీసుకువ చ్చారు. అంతేకాదు.. అప్ప‌ట్లో కేవ‌లం భోజ‌నం మాత్ర‌మే పెట్టేవారు. జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. యూనిఫాం, పుస్త‌కాలు, బెట్లు, షూస్ .. ఇలా ఒక కార్పొరేట్ త‌ర‌హా లుక్ తీసుకువ‌చ్చారు.

ఇక‌, పుస్త‌కాల విష‌యంలో రాజీ ప‌డిన ప‌రిస్థితి లేదు. విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం అవుతుండ‌డానికి నెల రోజుల ముందుగానే .. పుస్త‌కాల‌ను పంపిణీ చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, ఇంగ్లీషు మీడియం విద్య‌ను పిల్ల‌ల‌కు చేరువ చేశారు. ఈ క్ర‌మంలో అనేక ఇబ్బందులు వ‌చ్చాయి. అనేక స‌మ‌స్య‌లు కూడా ఎదుర య్యాయి. అయినా కూడా.. విద్యార్థుల‌కు ఇంగ్లీషు రావాల్సిందేన‌న్న ప‌ట్టుద‌ల‌తో సీఎ జ‌గ‌న్ అడుగులు వేశారు. దీంతో ఇప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతున్న గ‌వ‌ర్న‌మెంటు స్కూలు పిల్ల‌లు క‌నిపిస్తున్నాయి.

ఇక్క‌డితో కూడా.. జ‌గ‌న్ ఆగ‌లేదు. ట్యాబులు, బైజూస్ విద్య‌, ఐబీ కంటెంట్ అందిస్తున్నారు. ఇంకోవైపు కాలేజీల్లోనూ మార్పులు తీసుకువ‌చ్చారు. ఇష్టానుసారం చేసే కాలేజీల‌కు తాళం వేయించారు. విద్యార్థుల త‌ల్లిదండ్రులు ప్ర‌శ్నించేస్థాయిని తీసుకువ‌చ్చారు. ఎలా చూసుకున్నా.. విద్యారంగంలో స‌మూలమైన మార్పులు అయితే.. క‌నిపించ‌డం జ‌గ‌న్ హ‌యాంలో నే జ‌రిగింద‌నేది సందేహం లేని స‌మాధానం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: