గాజు గ్లాస్ గుర్తు.. కూటమికే గాయం చేయబోతుందా?

praveen
ఎన్నికల నగార మొగుడంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. అయితే అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టిడిపి పావులు కదుపుతుంది.  ఒంటరిగా వైసీపీని ఎదుర్కోలేం అని అర్థం చేసుకున్న టిడిపి బిజెపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ముందుకు సాగుతుంది. సీట్ల కేటాయింపులో సర్దుబాటు చేసుకుని ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక మూడు పార్టీలు ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు ఇక తమ పథకాలే తమను గెలిపిస్తాయి అనే ధీమాతో ప్రచార రంగంలో బరిలోకి దిగుతున్నారు. అయితే జనసేన పార్టీ ప్రస్తుతం గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ గాజు గ్లాసు గుర్తే కూటమికి మైనస్ కా మారబోతుందా అంటే అవును అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏపీలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరికీ కూడా ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తునే కేటాయిస్తూ ఉండడం గమనార్హం.

 దీంతో ఏపీలో ఎన్డీఏ కూటమికి గాజు గ్లాస్ గుర్తు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. జనసేన అభ్యర్థులు బరిలో లేని చోట ఇండిపెండెంట్ లకు ఈసీ గాజు గ్లాసు గుర్తులు కేటాయిస్తూ వస్తుంది. ఇప్పటికి 50కి పైగా ఎమ్మెల్యే 6 ఎంపీ స్థానాల్లో స్వతంత్రులకు ఈ గుర్తును కేటాయించడం గమనార్హం. దీంతో ఇక ఓట్లు వేసి సమయంలో జనసేనకి ఓటు వేస్తున్నామని అనుకొని ఎంతో మంది ఓటర్లు కన్ఫ్యూజన్లో పడిపోయే అవకాశం ఉందని.. తద్వారా తమ ఓట్లు చీలిపోతాయని కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. మంగళగిరి, కుప్పం, టెక్కలి, రాపాడు, అద్దంకి, పరుచూరు, మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో ఇలా ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: