జగన్ నిజమైన మాస్ లీడర్.. అలాంటి నేతలకే గొంతు ఎండిపోయేలా చేశాడుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజమైన మాస్ లీడర్ ఎవరు అనే ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా జగన్ పేరు సమాధానంగా చెప్పవచ్చు. జగన్ పాలన విషయంలో కొన్ని విమర్శలు ఉన్నా మొండిగా ముందుకెళ్తూ అనుకున్నది సాధించడంలో జగన్ కు ఎవరూ సాటిరారు. ఉద్ధండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేసిన జగన్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టం మామూలు కష్టం కాదు.
 
వైఎస్సార్ మరణం తర్వాత జగన్ పై కేసులు పెట్టినా వేధింపులకు గురి చేసినా ఓర్పు, సహనంతో ఒక్కో మెట్టు పైకి ఎదిగిన జగన్ తర్వాత రోజుల్లో నిజమైన మాస్ లీడర్ గా అవతరించారు. రాజకీయాల్లోకి రావాలని భావించే ఎంతోమందికి సీఎం జగన్ రోల్ మోడల్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన జగన్ ఇతర పార్టీల ప్రధాన రాజకీయ నేతలను గజగజా వణికిస్తున్నారు.
 
ముఖ్యమంత్రి పదవి సాధించే ప్రయత్నంలో సీఎం జగన్ కు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. జగన్ ను ఇబ్బందులకు గురి చేయడం వల్ల నేడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీఎం జగన్ మాస్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సైతం 2014 ఎన్నికల్లో సొంత నియోజకవర్గం అయిన పీలేరులో ఓటమిపాలయ్యారు.
 
రాజకీయ నాయకులలో కొంతమంది మాత్రమే తమ పాలనతో ముద్ర వేయడం సాధ్యమవుతుంది. గతంలో ఎప్పుడూ అమలు కాని స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసి నిరుపేద, పేద ప్రజలకు జగన్ చేసిన మంచి అంతాఇంతా కాదు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని మెజారిటీ సర్వేలు వెల్లడించడానికి జగన్ అమలు చేసిన హామీలే కారణం అని చెప్పవచ్చు. ఇతర పార్టీల నేతలు, ఆ రెండు పత్రికలు జగన్ పాలనపై ఎంత విషం కక్కుతున్నా వైసీపీ ఓటు బ్యాంక్ మాత్రం చెక్కు చెదరలేదనే చెప్పాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: