సికింద్రాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్.. ఇప్పుడు గెలుస్తుందా?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ స్థానం హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఎందుకంటే అన్ని పార్టీలకు సికింద్రాబాద్ స్థానం ఒక సెంటిమెంట్గా కొనసాగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన వారందరికీ కూడా కేంద్రంలో మంత్రి పదవులు వచ్చాయి. గతంలో బండారు దత్తాత్రేయ ఇక ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి కూడా ఇక కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకున్నారు. అయితే ఇక ఈ స్థానంలో గెలుపు పై ప్రస్తుతం మూడు పార్టీలు కూడా కన్నేసాయి.

 కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బంగపాటుకు గురైంది. దీంతో 39 స్థానాలతో కేవలం ప్రతిపక్షంతో మాత్రమే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సిన చోట్ల కూడా ఓడిపోయిన బీఆర్ఎస్ అటు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మాత్రం వరుసగా మూడోసారి క్లీన్ స్విఫ్ చేసింది. గతంలో 2014, 19 అసెంబ్లీ ఎన్నికల్లోను ఇక ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసింది. కానీ ఇక్కడ ఒక్కసారి కూడా ఎంపీ స్థానంలో విజయం సాధించలేకపోయింది.  ఈసారి పాత రికార్డులను తిరగరాసి ఇక పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించాలని అనుకుంటుంది బీఆర్ఎస్.

 అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సృష్టించిన ప్రభంజనం అంతా కాదు. అసలు రాష్ట్రంలో ఉంటుందా కనుమరుగవుతుందా అనే స్టేజ్ నుంచి ఇక బీఆర్ఎస్ కి కంచుకోటలు సైతం బద్దలు కొడుతూ భారీ స్థానాలలో విజయం సాధించింది. అలాంటి కాంగ్రెస్ కి అటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి లోని ఏడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ను ఓడించ లేకపోయింది. కనీసం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో  ఓటమి చవిచూసిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకే ఇక్కడ గెలుపు సాధ్యం కాలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎంపీ సీటు గెలవడం సాధ్యమవుతుందా లేదా అనేది హాట్ టాపిక్ మారింది. కాగా బిజెపి నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: