ఏపీ: జగన్ పై రాళ్ల దాడి.. సాక్ష్యం ఇదే..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన నిన్నటి రోజున రాళ్ల దాడి జరిగింది. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న సమయంలో సీఎం జగన్ పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. సీఎం జగన్ ప్రజలకు బస్సు పైనుంచి అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరో క్యాట్ బాల్ తో దాడి చేసినట్లుగా అక్కడ పోలీసులు అనుమానించినట్లు సమాచారం.

రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి పైన కనుబొమ్మ పైన పెద్ద గాయమైనట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని కొంతమంది టిడిపి నేతలు ఇది నిజమా కాదా.. తానే కట్టు కట్టుకొని ఇలా చేస్తున్నారనే వాదనలను కూడా తెలియజేస్తున్నారు. అందుకే కొంతమంది సోషల్ మీడియాలో వైసిపి కార్యకర్తలు కూడా ఫోటోలను, వీడియోలను  కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సభ జరుగుతున్నటువంటీ సమయంలో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. అక్కడ పబ్లిక్ గానే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.

అయితే సీఎం జగన్ కు కాస్త కంటికి కింద తగిలింటే కన్నుపోయే పరిస్థితి ఏర్పడేది. రాళ్ల దారి జరుగుతున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ రాళ్ల దాడికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది కరెంటు లేని సమయం చూసి కొంతమంది సీఎం జగన్ పైన అగంతకులు దాడికి పాల్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దాడి జరిగిన సంఘటనలోని ప్రజలతో పాటు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా ఒక్కసారిగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలా గాయమైన తర్వాత చికిత్స అనంతరం సీఎం జగన్ తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. కంటికి కూడా కుట్లు పడే అవకాశం ఉంటుందని వైద్యుల సైతం వెల్లడిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని అడుగుపెట్టిన మొదటి రోజు ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు జగన్ కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కొంతమంది టిడిపి నేతలు  ఇలా దాడి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: