ఏపీకే దిక్కులేదు.. పవన్ కు తెలంగాణలో పోటీ అవసరమా?

praveen
ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలక రాజకీయాలలో భాగం కావాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురయింది. అయితే ఇక ఇప్పుడు మరోసారి పవన్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే మునుపటిలా అన్ని స్థానాలలో కాకుండా టిడిపి బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని కేవలం 22 అసెంబ్లీ స్థానాలలో రెండు పార్లమెంట్ స్థానాలలో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

 అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఇక ఈసారి మాత్రం తప్పక గెలవాలి అనే లక్ష్యంతో ఎలాంటి తప్పులు చేయకుండా ముందుకు సాగుతున్నారు. వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తే ఈసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేలాగే కనిపిస్తున్నారు. కానీ జనసేన పార్టీ తరఫున నిలబడిన వారిలో ఎంతమంది విజయం సాధిస్తారు అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. కాగా ప్రస్తుతం ఎలక్షన్స్ నేపథ్యంలో అటు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

 ఇదిలా ఉంటే ఇప్పుడు జనసేన పార్టీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసేందుకు సిద్ధమవుతుందట. ఇక ఇటీవల తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో పోటీ దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగానే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు రెడీ అవుతుందట. కానీ ఇప్పుడు వరకు ఒక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు జనసేన  అయితే ఈ విషయం తెలిసి కొంతమంది షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు పవన్ బాగా కాన్సెంట్రేట్ చేసిన ఏపీలోనే జనసేనకు ఒక్క పదవి లేదు. ప్రస్తుతం అక్కడ పూర్తిస్థాయి దృష్టి పెట్టడం మానేసి తెలంగాణ రాజకీయాలువైపు పవన్ దృష్టి మళ్లిందేంటి అని చర్చించుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: