ఇంట‌ర్ క్యాస్ట్ సెంటిమెంట్ తో మారిన వైసీపీ అనంతపూర్ లెక్కలు.. వాళ్లే గెలుస్తారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రంలో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంట‌ర్ క్యాస్ట్ సెంటిమెంట్ తో ఉమ్మడి అనంతపూర్ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ దీపికను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం వెనుక అసలు ప్లాన్ వేరే ఉంది.
 
దీపిక కురుబ సామాజికవర్గానికి చెందిన నేత కాగా హిందూపురం నియోజకవర్గంలో కురుబల జనాభా ఎక్కువగా ఉండటం ఆమెకు ప్లస్ అవుతోంది. దీపిక భర్త రెడ్డి కావడంతో రెడ్ల ఓట్లు కూడా వైసీపీకి పడతాయని ఆ పార్టీ ఫీలవుతోంది. ఇంట‌ర్ క్యాస్ట్ సెంటిమెంట్ తో ఈ ఎన్నికల్లో హిందూపురం ఫలితం మారనుందని వైసీపీ కాన్ఫిడెన్స్ తో ఉంది. గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి గెలిచిన ఉష శ్రీ చరణ్ ఈ ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేయనున్నారు.
 
పెనుగొండలో టీడీపీ నుంచి సవితమ్మ పోటీ చేస్తున్నారు. ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ బీసీ కురుబ కాగా ఆమె భర్త రెడ్డి కావడం గమనార్హం. కళ్యాణదుర్గంలో గత ఎన్నికల్లో 19 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించిన ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ ఈ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యేగా గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. పెనుగొండ నియోజకవర్గంలో ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ కు అనుకూల ఫలితాలు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.
 
వై నాట్ 175 అని పైకి జగన్ చెబుతున్నా ప్రజల్లో గత ఐదేళ్లలో వైసీపీపై వ్యతిరేకత ఊహించని స్థాయిలో జరిగింది. వైసీపీకి కంచుకోట లాంటి జిల్లాలలో సైతం లెక్కలు శరవేగంగా మారుతున్నాయి. అయితే ఇంటర్ క్యాస్ట్ పాలిటిక్స్ తో కొన్ని నియోజకవర్గాల్లో తమకే అనుకూల ఫలితాలు వస్తాయని వైసీపీ భావిస్తోంది. దీపిక, ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ లెక్క ఈ ఎన్నికల్లో  సత్ఫలితాలను ఇస్తే భవిష్యత్తులో ఇతర జిల్లాల్లో సైతం ఇంటర్ క్యాస్ట్ సెంటిమెంట్ దిశగా వైసీపీ అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: