వరంగల్ : గుంటూరోళ్లు.. ఇక్కడ పోటీ చేయడమేంటి?

praveen
ఇటీవల కాలంలో రాజకీయాల తీరు పూర్తిగా మారిపోయింది. సాధారణంగా అయితే పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటివి కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఇలా విమర్శలు చేయాల్సి వస్తే కేవలం రాజకీయపరంగా మాత్రమే విమర్శలు చేసేవారు  రాజకీయంగా ఆయా నాయకులు పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారు.. ఎలాంటి తప్పులు చేశారు అన్న విషయాన్ని ప్రస్తావించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఎక్కువైపోయింది.

ఒకరిపై ఒకరు ఏకంగా వ్యక్తిగత విషయాలను సైతం టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇలాంటి వ్యక్తిగత విమర్శలు నేటి రాజకీయాల తీరును చెప్పకనే చెబుతున్నాయ్. కాగా ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో మరోసారి విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే  లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇక వ్యక్తిగత విమర్శలు చేసే నాయకులు కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు.

 కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కడియం కావ్య. అయితే ముందుగా ఈమె బీఆర్ఎస్ నుంచి టికెట్ అందుకున్నారు. కానీ పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉండడం.. ఇక కొన్ని కేసులు చుట్టూ ముట్టడంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలగడంతో తాను బీఆర్ఎస్ లో ఉండలేను అంటూ కేసిఆర్ కు లేఖ రాసిన కడియం కావ్య.. ఇక కారు పార్టీలో చేరి అక్కడ వరంగల్ నుంచి ఎంపీ టికెట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను ఉద్దేశిస్తూ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడం గమనార్హం. లోకల్ నాన్ లోకల్ అంటూ వ్యక్తిగత విషయాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. కాగా ఇదే విషయంపై మాట్లాడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కడియం కావ్య కు వరంగల్ తో సంబంధం ఏంటో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆమె కడియం కావ్య కాదని మహమ్మద్ కావ్య  నదురుద్దీన్ అంటూ విమర్శలు చేశారు. కడియం కావ్య అత్తగారి ఊరు గుంటూరు అని.. గుంటూరుకు చెందిన ఆమె ఇప్పుడు వరంగల్లో ఎందుకు పోటీ చేస్తుంది అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని.. స్థానికుడు అయిన తనకు మద్దతుగా నిలవాలి అంటూ కోరారు ఆరూరి రమేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: