ఏపీ : రోజాకు నగరి నల్లేరుపై నడక కాదా.. వాళ్లే ఆమెను ఓడించబోతున్నారా?

Reddy P Rajasekhar
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి మరోసారి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రోజా హ్యాట్రిక్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉండగా సొంత పార్టీ నేతలే ఆమెను ఓడిస్తామని చెబుతుండటం గమనార్హం. 2014, 2019 ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా గెలిచినా స్వల్ప మెజారిటీతోనే ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. 2019 ఎన్నికలతో పోల్చి చూస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.
 
ఒక దశలో రోజాకు వైసీపీ నుంచి నగరి టికెట్ దక్కే ఛాన్స్ కూడా లేదని కామెంట్లు వినిపించాయి. రోజాపై ఉన్న అభిమానంతో మాత్రమే జగన్ ఆమెకు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
 గత ఎన్నికల్లో రోజా గెలవడానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాను ప్రకాష్ తమ్ముడు జగదీష్ సపోర్ట్ కారణమని తనకు టీడీపీ సీటు కేటాయించకపోవడంతో జగదీష్ రోజాకు అనుకూలంగా పని చేశారని ప్రచారం జరిగింది. నగరి నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉండగా పార్టీ కార్యకర్తలు రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 
టీడీపీలోని కొంతమంది నేతలకు రోజా అనుకూలంగా వ్యవహరించడం కూడా ఆమెపై సొంత పార్టీ నేతల్లో  తీవ్రస్థాయిలో వ్యతిరేకతకు కారణమని తెలుస్తోంది. నగరి నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల మంది ఓటర్లు ఉండగా గతంలో సినిమా హీరోయిన్ అనే క్రేజ్ కూడా రోజాకు ప్లస్ అయింది. రోజా మంత్రి అయిన తర్వాత కూడా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదు. అదే సమయంలో సొంత పార్టీ నేతలే ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు.
 
ఇతర పార్టీల నేతలపై ఇష్టానుసారం విమర్శలు చేయడం కూడా రోజాకు మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలను కలుపుకుని ముందుకెళ్తే రోజాకు మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. పెద్దిరెడ్డి, మరి కొందరు నేతలతో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుని రోజా ముందడుగులు వేస్తే గెలవడానికి కనీసం ఛాన్స్ ఉంటుంది. రోజా చేస్తున్న చిన్నచిన్న తప్పులే ఆమెకు మైనస్ అవుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. రోజా ఇప్పటికైనా మారకపోతే నగరి నియోజకవర్గంలో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: