ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..తాజాగా వైఎస్
వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ వైఎస్ సునీతా
రెడ్డి 'జస్టిస్ ఫర్ వివేకా' పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు.హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు..దివంగత నేత వైఎస్
వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరిగినట్లు ఆమె తెలిపారు..వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అనేక రాజకీయ కుట్రలు జరిగాయని ఆమె తెలిపారు..
జగన్ జైలులో ఉన్నప్పుడు
షర్మిల పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపిందని సునీత చెప్పుకొచ్చారు.
జగన్ కోసం ఆయన స్థాపించిన
పార్టీ కోసం
షర్మిల 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందని ఆమె గుర్తు చేశారు. సొంత కుటుంబ సభ్యులు
షర్మిల, వివేకాకు
జగన్ అన్యాయం చేశారని సునీత ఆరోపించారు.
జగన్ జైల్లో ఉన్న సమయంలో
షర్మిల పోరాటంతోనే 2012 ఉప ఎన్నికలలో వైసీపీకి సీట్లు వచ్చాయని ఆమె తెలిపారు.ప్రజలలో షర్మిలకు వస్తున్న పాపులరిటీని చూసి ఓర్వలేక ఆమెను దూరం పెట్టారని సునీత ఆరోపించారు..
తమ కుటుంబంలో
కడప ఎంపి సీట్ ఎంతో కీలకం అని ఆమె పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర
రెడ్డి చనిపోయిన దగ్గర నుండి మా కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని ఆమె అన్నారు.
2019 ఎన్నికల్లో
అవినాష్ రెడ్డి గెలుపు కోసమే వివేకా ప్రచారం చేశారని కానీ
అవినాష్ వాళ్ళు చంపాలనుకున్నారని సునీత ఆరోపించారు.వివేకా
హత్య కేసు గురించి సీబీఐ, కోర్టులలో న్యాయం జరగాలంటే ఆలస్యం అవుతుందని.. అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని ఆమె చెప్పారు .
అవినాష్ రెడ్డి లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లొద్దు అన్నదే తన ధ్యేయం అని ఆమె పేర్కొన్నారు.
ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసమే వివేకానంద రెడ్డిని
హత్య చేశారంటూ సునీత సంచలన ఆరోపణలు చేశారు.పగ తీర్చుకోవడం తన ధ్యేయం కాదని అలా అనుకుంటే కడపకు వెళ్లి తానే వారిని నరికేసే దానిని అంటూ సునీత సంచలన కామెంట్స్ చేశారు.తన వెనుక ఎటువంటి రాజకీయపార్టీ లేదని సునీత తెలిపారు. వివేకా
హత్య కేసులో న్యాయం జరిగే వరకు నా న్యాయ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.