అన్నింటికీ కాంగ్రెస్సే కారణం.. బిఆర్ఎస్ విమర్శలు?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో అటు తెలంగాణ రాజకీయాలు ఎంతలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని పార్టీలు కూడా విమర్శలు ప్రతి విమర్శలతో బిజీబిజీగా ఉన్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఇక దానిని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతూ ప్రతిపక్షం బిఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది.

 అయితే ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో భాగ్యనగర్గంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో కాలనీలలో సరిపడా నీళ్లు లేక ఇక జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో సరిగా పంటలు వండడం లేదని అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే అంటూ బిఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంటలు సస్యశ్యామలంగా పండాయని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరువు వచ్చింది అంటూ విమర్శిస్తుంది. ఇక ఇప్పుడు హైదరాబాదులో నెలకొన్న నీటి కష్టాల గురించి కూడా కాంగ్రెస్ ఫై విమర్శలు గుప్పిస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.

 ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న ఫిర్ధాజిగూడ  మేయర్ జక్కా వెంకట్ రెడ్డి హైదరాబాద్లో మొదలైన నీటి కష్టాల గురించి స్పందిస్తూ  అటు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. నగరంలో 10 ఏళ్ళ కిందట అంతరించిపోయిన కన్నీటి కళను మళ్లీ మన కండ్ల ముందు ఉంచిన తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా అభినందనలు తెలిపాలో అర్థం కావట్లేదు. ఇకనుంచి కాలనీలో రోడ్లపై బిందెలు నీళ్ల కోసం మన అమ్మలు అక్కలు సిగలు పట్టుకొని కొట్టుకోవడం సర్వసాధారణమే. ఇది మన కాంగ్రెస్ తెచ్చిన గొప్ప మార్పు అంటూ జక్క వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: